శ్రీదేవి ముందు అందం చిన్న‌బోయింది

శ్రీదేవి ముందు అందం చిన్న‌బోయింది
x
Highlights

అందం చిన్న బోయింది అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన జగదేక సుందరి శాశ్వత నిద్రలోకి జారుకుంటే మరి అందం చిన్న బోక ఏమవుతుంది? ఇక శెలవంటూ ఈ లోకాన్ని వదిలి...

అందం చిన్న బోయింది అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన జగదేక సుందరి శాశ్వత నిద్రలోకి జారుకుంటే మరి అందం చిన్న బోక ఏమవుతుంది? ఇక శెలవంటూ ఈ లోకాన్ని వదిలి వెళ్లే చివరి ఘడియల్లోనూ నిండు ముత్తైదువలా కనిపించి ఆ రూపాన్ని అభిమానుల గుండెల్లో శాశ్వతంగా బందీ అయిపోయింది. దటీజ్ శ్రీదేవి..

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ ఎక్కడో శివకాశిలో పుట్టి యావత్ ప్రపంచాన్ని తన నటనతో, ఎనలేని అందంతో ఆకట్టుకున్న ఆ ముగ్ధ మోహన రూపం ఇక శెలవంటూ నిష్క్రమించింది. మరణంలోనూ అందంగానే కనపడాలని శ్రీదేవి అనుకుంది కాబోలు అందుకే ముత్తైదువలా పెద్ద బొట్టు, మెడలో నల్లపూసలు, బంగారు లక్ష్మీ దేవి హారం, పెదాలకు లిప్ స్టిక్ ఎర్రని పట్టుచీరలో శ్రీదేవి నిద్రపోతున్నట్లుగానే ఉంది.. అంతిమ యాత్రకు బయల్దేరిన ఈ దేవకన్య తన చివరి గుర్తునూ అభిమానుల గుండెల్లో శాశ్వతంగా ఇలా ముద్రించి వెళ్లింది.

శ్రీదేవికి తెల్లని రంగన్నా తెల్లని పూవులన్నా మరీ ఇష్టం అందుకే శ్రీదేవిని కడసారి దర్శించుకునేందుకు ఉంచిన సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ఆమెను ఉంచిన ప్రదేశాన్ని తెల్లని పూలతో అలంకరించారు తెల్లని లిల్లీ పూలు, చామంతులతో అలంకరించిన మంచంపై ఆమెను ఫ్రీజర్ లో ఉంచారు.

ఆమెకు ఎర్రని పట్టుచీరను చుట్టారు ఆ చుట్టుపక్కల అంతా ఎటు చూసినా తెల్లని పూవులే అంతేకాదు శ్రీదేవికి ఐస్ క్రీమ్ అన్నా కేక్ అన్నా విపరీతమైన ఇష్టం. అందుకే ఆమె భౌతిక కాయం పక్కనే ఎలాంటి కలర్లు, ఫ్లేవర్లు మిక్స్ చేయకుండా తయారు చేసిన తెల్లని పెద్ద కేక్ ను ఉంచారు శ్రీదేవి భర్త బోనీ కపూర్,కుమార్తెలు జాహ్నవి, ఖుషి తెల్లని దుస్తుల్లో విషాద వదనాలతో కనిపించారు. శ్రీదేవి అందానికి నిర్వచనం అపురూపానికి పర్యాయపదం ఆమె నవ్వితే కోటి మల్లెల జల్లు కురిసినట్లుంటుంది అలాంటి శ్రీదేవి హటాత్తుగా కన్నుమూసింది. చివరి ఘడియల్లో నిండు ముత్తైదువలా మనకు కనిపించి తరలి పోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories