విల‌పిస్తున్న ముంబై న‌గ‌రం

విల‌పిస్తున్న ముంబై న‌గ‌రం
x
Highlights

లేడి సూప‌ర్ స్టార్ శ్రీదేవి మ‌ర‌ణంపై మిస్ట‌రీ వీడింది. 70గంట‌ల పాటు జ‌రిగిన క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ‌త‌లో శ్రీదేవి బాత్ ట‌బ్ లో ప‌డిపోవ‌డం వ‌ల్ల మృతి...

లేడి సూప‌ర్ స్టార్ శ్రీదేవి మ‌ర‌ణంపై మిస్ట‌రీ వీడింది. 70గంట‌ల పాటు జ‌రిగిన క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ‌త‌లో శ్రీదేవి బాత్ ట‌బ్ లో ప‌డిపోవ‌డం వ‌ల్ల మృతి చెందార‌ని ఫారెన్సిక్ రిపోర్టును ప్రాసిక్యూష‌న్ ఏకీభ‌వించింది. బాత్ ట‌బ్ లో చ‌నిపోవ‌డంలో శ్రీదేవి మ‌ర‌ణించింద‌ని తేల్చి చెప్పింది .దీంతో అనుమానాలకు తెరదించుతూ శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె బంధువ‌ల‌కు అప్ప‌గించారు.
బోనీక‌పూర్ మేన‌ళ్లుడిపెళ్లికి వెళ్లిన శ్రీదేవి దుబాయ్ జుమైరా ఎమిరేట్స్ హోట‌ల్ బాత్రూంలో చ‌నిపోవ‌డం సంచ‌ల‌నం రేపింది. కేసు విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. తొల‌త గుండెపోటు వ‌ల్ల చ‌నిపోయింద‌ని శ్రీదేవి బంధువులు తెలిపారు. ఇదేవిష‌యాన్ని వైద్యులు కూడా స్ప‌ష్ట‌త ఇచ్చారు.
అయితే శ్రీదేవి బౌతిక కాయాన్ని అప్ప‌గించడంలో జాప్యం జ‌ర‌గ‌డంతో అనేక అనుమానాలు త‌లెత్తాయి. దీంతో దుబాయ్ పోలీసులు కేసును ప్రాసిక్యూష‌న్ కు అప్ప‌గించింది. ఈ కేసుపై సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టిన ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్ తొల‌త ఫారెన్సిక్ రిపోర్టును న‌మ్మ‌లేమ‌ని కొట్టిపారేసింది. ఆ త‌రువాత శ్రీదేవి బాత్ ట‌బ్ లో చ‌నిపోయారని, ఆమె శ‌రీరంలో ఆల్కహాల్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.
దీంతో బోనీ ఇత‌ర కుటుంబంస‌భ్యుల్ని అదుపులోకి తీసుకొని విచార‌ణ చేప‌ట్టారు. బోనీ - శ్రీదేవి కాల్ డేటాను చెక్ చేశారు.విచార‌ణ లో ఉండ‌గా ప్రాసిక్యూష‌న్ బోనీక‌పూర్ ను ప‌లు ప్ర‌శ్న‌లు సంధించ‌గా వాటిపై పొంత‌న‌లేని స‌మాధానం చెప్ప‌డంతో కేసును మ‌రింత లోతుగా విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్రాసిక్యూష‌న్ భావించింది.
ఈ నేప‌థ్యంలో శ్రీదేవి చ‌నిపోయి గంట‌ల గ‌డుస్తున్న ఆమె భౌతిక కాయం అప్ప‌గించ‌క‌పోవ‌డంతో అనుమానాలు మొద‌ల‌య్యాయి. రెండో సారి పోస్టుమార్టం చేసి వ‌చ్చిన నివేదిక ఆదారంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని దుబాయ్ అధికారులు భావించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.
కానీ విచార‌ణ‌లో ఉండ‌గా కొన్ని విష‌యాల‌పై స్ప‌ష్ట‌త రావ‌డంతో శ్రీదేవి బాత్ ట‌బ్ లో ప‌డి చనిపోయార‌ని ప్రాసిక్యూష‌న్ తేల్చి చెప్పింది. దీంతో అతిలోక సుంద‌రి మ‌ర‌ణంపై క్లారిటీ వ‌చ్చింది.
అనంత‌రం శ్రీదేవి భౌతిక కాయానికి ఎంబామింగ్ చేశారు. అనంత‌రం ప్ర‌త్యేక విమానంలో దుబాయ్ నుంచి ఆమె బౌతిక కాయాన్ని ముంబైకి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా శ్రీదేవి కుటుంబ‌స‌భ్యులు ఆమె అంత్య‌క్రియ‌ల గురించి ప్ర‌క‌ట‌న చేశారు. భర్త బోనీ కపూర్‌, కుమార్తెలు ఖుషి, జాహ్నవితో పాటు కపూర్‌, అయ్యప్పన్ కుటుంబ సభ్యులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు శ్రీదేవి అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఉంచుతారు. అనంతరం 2 గంటల నుంచి అంతిమ యాత్ర మొదలు కానుంది. తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విలే పార్లే సేవా సమాజ్‌ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories