బీమా సొమ్ము కోసమే శ్రీదేవిని చంపేశారా?

బీమా సొమ్ము కోసమే శ్రీదేవిని చంపేశారా?
x
Highlights

భారతీయ చలనచిత్ర అతిలోక సుందరి శ్రీదేవి మరణం మరోమారు హాట్ టాపిక్ అయింది. ఆమె పేరున ఉన్న రూ.240 కోట్ల బీమా సొమ్ము కోసమే శ్రీదేవిని హత్య చేశారన్న తాజా...

భారతీయ చలనచిత్ర అతిలోక సుందరి శ్రీదేవి మరణం మరోమారు హాట్ టాపిక్ అయింది. ఆమె పేరున ఉన్న రూ.240 కోట్ల బీమా సొమ్ము కోసమే శ్రీదేవిని హత్య చేశారన్న తాజా వార్త సంచలనమైంది. శ్రీదేవి మరణంపై సమగ్ర దర్యాప్తు కోరుతూ నిర్మాత సునీల్ సింగ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఇటువంటి సంచలన విషయాలు మరెన్నో ఉన్నాయి. అయితే, శ్రీదేవి మరణంపై దర్యాప్తు అవసరం లేదని అప్పట్లో ఈ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. అయితే, అందులోని అంశాలు ఇప్పుడు బయటకొచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి తోడు ఓ మాజీ పోలీసు అధికారి వ్యక్తీకరించిన అభిప్రాయాలు చర్చనీయాంశమవుతున్నాయి.

సునీల్‌ సింగ్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం శ్రీదేవి పేరిట రూ.240 కోట్లకు ఓ జీవిత బీమా పాలసీని ఒమాన్‌లో తీసుకున్నారు. ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే ఆ సొమ్ము వారసులకు చేరుతుంది అన్న ఓ నిబంధన అందులో ఉంది. అయితే ఒక వ్యక్తి పేరిట రూ.240 కోట్ల జీవిత బీమా ఇస్తారా? మరో సందేహం ఏంటంటే దుబాయ్‌లో చనిపోతేనే ఆ సొమ్ము ఆమె వారసులకు ఇస్తారనేది! ఇలాంటి నిబంధన సాధారణంగా ఏ జీవిత బీమా సంస్థలోనూ ఉండదని పోలీసు వర్గాలంటున్నాయి.

మరోవైపు, ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణం అనుమానాస్పదేమనని అనేకమంది ఇప్పటికీ నమ్ముతున్నారు. 'దుబాయ్‌ అంటే మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అడ్డా. శ్రీదేవి మరణంలో అతని పాత్ర ఉండి ఉండొచ్చు. విదేశాల్లో ముఖ్యంగా ఒక ఇస్లామిక్‌ దేశంలో ఆయన దర్యాప్తును ప్రభావితం చేయగలడు' అని వేద్‌ భూషణ్‌ అనే రిటైర్డ్‌ ఏసీపీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈయన ఓ ప్రైవేట్‌ దర్యాప్తు సంస్థ నడుపుతున్నారు. ప్రమాదవశాత్తూ శ్రీదేవి బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయారన్న పోస్ట్‌మార్టం రిపోర్టు నమ్మశక్యం కాదని ఆయన వాదిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories