2 గంటలకు భారత్‌కు శ్రీదేవి భౌతికకాయం

Submitted by arun on Sun, 02/25/2018 - 13:35
ssss

ప్రముఖ సినీనటి, అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారత్‌కు తీసుకరానున్నారు. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లారు. శనివారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ముంబైకి తీసుకొచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బాలీవుడ్ వర్గాలు సమాచారం. శ్రీదేవి హఠాన్మరణం చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 

English Title
sridevi deadbody be arrived india around 2 pm

MORE FROM AUTHOR

RELATED ARTICLES