దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌కి శ్రీదేవి భౌతికకాయం

Submitted by arun on Tue, 02/27/2018 - 17:14
Sridevi

శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఆమె భౌతికకాయంతో బోనీ కపూర్‌, ఇతర కుటుంబీకులు దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇతర ప్రక్రియలు పూర్తైన అనంతరం విమానం బయలుదేరుతుంది. ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో భౌతికకాయాన్ని ముంబయికి తరలించనున్నారు. రాత్రి 9 గంటల  తర్వాత శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకునే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటల వరకు.. శ్రీదేవి స్వగృహం భాగ్యబంగ్లాలో ఆమె భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
 

English Title
sridevi dead body reaches to dubai airport

MORE FROM AUTHOR

RELATED ARTICLES