ముంబైకి చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం

Submitted by arun on Tue, 02/27/2018 - 21:52
sr

శ్రీదేవి పార్థీవ దేహం ముంబై ఛత్రపతి విమానశ్రయానికి చేరుకుంది.  దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని ముంబైకి తీసుకొచ్చారు. శ్రీదేవి మృతదేహాం వెంట బోనీకపూర్‌, ఖుషీ కపూర్‌లు ఉన్నారు. ముంబై ఎయుర్‌పోర్ట్‌కు శ్రీదేవి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఎయిర్‌పోర్ట్‌ వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. 

రేపు ఉదయం 9 గంటలకు గ్రీన్‌ ఎకర్స్‌ నుంచి కంట్రీ క్లబ్‌కు శ్రీదేవి పార్థీవదేహన్ని తరలించనున్నారు. ఉదయం తొమ్మిదన్నర నుంచి మధ్యాహ్నం పన్నెడున్నర వరకు అభిమానుల సందర్శనకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం పన్నెడున్నర నుంచి ఒకటింటి వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. అనంతరం రెండు గంటలకు అంతిమయాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం మూడున్నరకు విలే పార్లే హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

English Title
sridevi dead body arrived mumbai

MORE FROM AUTHOR

RELATED ARTICLES