కళ్లు తెరిస్తే అమ్మ.. కళ్లు మూసుకుంటే అమ్మ..

కళ్లు తెరిస్తే అమ్మ.. కళ్లు మూసుకుంటే అమ్మ..
x
Highlights

కళ్లు తెరిస్తే అమ్మ.. కళ్లు మూసుకుంటే అమ్మ.. నిరంతరం తమ వెంటే తోడు, నీడగా ఉన్న తల్లి ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ఆ పిల్లలను దహించేస్తోంది....

కళ్లు తెరిస్తే అమ్మ.. కళ్లు మూసుకుంటే అమ్మ.. నిరంతరం తమ వెంటే తోడు, నీడగా ఉన్న తల్లి ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ఆ పిల్లలను దహించేస్తోంది. తమనంతలా ప్రేమించి, ఆప్యాయతను పంచిన తల్లి ఇక లేదన్న నిజాన్ని శ్రీదేవి పిల్లలు ఖుషి, జాహ్నవి జీర్ణించుకోలేకపోతున్నారు..రేపటి నుంచి అమ్మలేని జీవితాన్ని ఎలా గడపాలో తెలియని అయోమయంలో ఉన్నారు వారిద్దరూ..

ఓ మహానటి మరలి పోయింది వందల చిత్రాల్లో నటించి మనల్ని నవ్వించి, ఏడ్పించి, కవ్వించి ఆకట్టుకున్న ఆ ముగ్ధ మోహన రూపం అదృశ్యమైపోయింది పంచభూతాల్లో కలసిపోయింది.
తనను అభిమానించి, ఆరాధించిన కోట్లాది మంది నుంచి తుది వీడ్కోలు తీసుకుని అదృశ్యమైంది ఈ దేవకన్య. శ్రీదేవి మరణంతో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది ఆమె పిల్లలు జాన్వి.. ఖుషి వారి బాధ వర్ణనాతీతం అమ్మ ముఖంలో వారెప్పుడూ విషాదాన్ని చూడలేదు. నిరాశను చూడలేదు అమ్మ వారికి ఎప్పుడూ నిత్యనూతన ఉత్తేజం అందించే అద్భుత రూపమే ఓ భరోసాను, ఆలంబనను కల్పించే అమృత ప్రాయమే కానీ ఇప్పుడు ఆ చైతన్య జ్యోతి ఆరిపోయింది.

శ్రీదేవి జీవితంలో తానే సమస్య ఎదుర్కొన్నా వాటిని పిల్లల వరకూ తీసుకు వచ్చే వారు కాదు వారికి బాధన్నది ఎలా ఉంటుందో తెలీకుండా పెంచారు. చిన్నప్పుడు బుడి బుడి అడుగులు వేసే నాటి నుంచి జాన్వి, ఖుషీలకు అన్నింటికీ అమ్మే ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మా అంటూ వాలిపోయేవారు క్లబ్బులు, పబ్బులు, సోషలైట్ డిన్నర్లు ఎక్కడికైనా తల్లి పక్కన లేకపోతే అసలు కదిలే వారు కాదు ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ అకేషన్ కి ఎలా అలంకరించుకోవాలి ఇలాంటి వన్నీ శ్రీదేవి వారికి దగ్గరుండి నేర్పేవారు. పిల్లలను ఒక బాధ్యతగా ఆమె భావించారు వారికోసం తన నటనకూ గుడ్ బై చెప్పేశారు. నిజానికి శ్రీదేవి కోరుకుంటే ఇప్పటికీ ఆమెకు ఎన్నో అవకాశాలు వస్తాయ్ కానీ పిల్లలకు మంచి పునాది వేయాలనే తపన తోనే ఆమె వారిని అంటిపెట్టుకుని ఉండిపోయారు.

తల్లి చివరి క్షణాలలో దగ్గర లేకపోవడం ఆ చిన్నారులిద్దరినీ కలచి వేస్తోంది. సరదాగా నవ్వుతూ, తుళ్లుతూ దుబాయ్ వెళ్లిన తల్లి ఇలా నిర్జీవంగా అచేతన స్థితిలో వెనుకకు రావడం జాహ్నవి తట్టుకోలేకపోతోంది. తల్లి మరణ వార్త తెలిసినప్పటినుంచి జాహ్నవి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది.. ఖుషీ కపూర్ కి అసలేం జరిగిందో అర్ధం కానంత చిన్నతనం..తల్లి అంతిమ యాత్రలో తండ్రి పక్కన నిలబడి చూస్తున్న అయోమయపు చూపులు మనల్ని కలచి వేస్తాయి. జాహ్నవి తొలి సినిమా ధడక్ మంచి హిట్ అవ్వాలని శ్రీదేవి ఎంతగానో తపించింది జాహ్నవిని మంచి నటిని చేయాలన్న ఆశతోనే ఆమె ప్రత్యేక తర్ఫీదు నిప్పించింది తన పేరు ప్రతిష్టలను, డబ్బును, పలుకుబడిని ఫణంగాపెట్టి జాహ్నవి జీవితానికి బాటలు వేయాలని ఆమె కష్టపడింది. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె కన్ను మూసింది.

జాహ్నవి ప్రేమ వ్యవహారంతో తలనొప్పులు ఎదుర్కొన్న శ్రీదేవి ఒక తల్లిగా వారి భవిష్యత్తు కోసం తానెంత ఆరాటపడుతున్నారో మామ్ చిత్రం ద్వారా తెలిపారనే వార్తలున్నాయి. ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లలకు తల్లి తోడు అత్యవసరం అన్ని విషయాలూ తండ్రితో షేర్ చేసుకోలేరు ఏ చిన్న కష్టమొచ్చినా అమ్మ యితే అర్ధం చేసుకుని భరోసానిస్తుంది కానీ ఇప్పుడు శ్రీదేవి లేకపోవడమే వారిద్దరికీ పెద్ద లోటు ఇకపై ఇంట్లో అమ్మ ముఖం కనిపించదు ఏ అకేషన్ కు అమ్మ రాదు తమ కష్ట సుఖాలు వినే తోడు లేదు తల్లి లేని ఆ ఇంటినే వారు ఊహించలేకపోతున్నారు ఆ నిజాన్ని వారు భరించలేకపోతున్నారు. శ్రీదేవి లేని లోటు ఆ పిల్లలకు తీర్చలేనిది తమ జీవితానికో దారిని చూపి మార్గదర్శకత్వం చేసే తల్లి లేకపోవడం వారికి పెద్ద దెబ్బ బంధు మిత్రులందరూ వచ్చి ఓదార్చి వెళ్లిపోతుంటే బేల ముఖంతో దిగాలుగా కనిపిస్తున్నారు.ఈ దు:ఖం నుంచి కోలుకోవాలంటే కాలమే వారి గాయాన్ని మాన్పాలి.

बहन खुशी के साथ खड़ी हैं जाह्नवी

Show Full Article
Print Article
Next Story
More Stories