దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు శ్రీదేవి కేసు ట్రాన్స్‌ఫర్

Submitted by arun on Mon, 02/26/2018 - 18:21
Sridevi

అతిలోక సుందరి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో చనిపోయిందనేది దుబాయ్‌ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో తేలింది. అయితే ఇప్పటి వరకూ తను ఏ కారణంతో మరణించిందన్న సందేహం అందరిలో వ్యక్తమయ్యింది. శ్రీ‌దేవి మృత‌దేహం రాక మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ఈ కేసును లోతుగా ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. పోస్టుమార్ట‌మ్ ఆల‌స్యం, ఫోరెన్సిక్ రిపోర్టుపై ప‌లు అనుమానాలు త‌లెత్తిన నేప‌థ్యంలో దుబాయ్ పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. కాసేపటి క్రితమే శ్రీదేవికి నిర్వహించిన ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్‌లో ఆమె ప్రమాదవశాత్తు మరణించినట్లు తేల్చారు.

శ్రీదేవి రక్తం నమూనాలో ఆల్కహాల్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. కానీ శరీరం తూలి ఆమె బాత్‌టబ్‌లో జారిపడినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టమ్ పూర్తి కావడంతో శ్రీదేవి శరీరాన్ని ఎంబాల్మింగ్‌కు పంపినట్లు తెలుస్తోంది. పోలీస్ నివేదిక దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు చేరుకున్న తర్వాత.. ఆ కేసులో న్యాయప్రక్రియను పూర్తి చేస్తారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ వ్య‌క్తి న్యాయపరమైన హక్కులను కాపాడుతుంది. ఏదైనా కేసు విచారణలో ఉన్న పారదర్శకతను అది విశ్వసిస్తుంది.

English Title
sridevi case transferred to dubai public prosecution

MORE FROM AUTHOR

RELATED ARTICLES