57అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుడు

Submitted by admin on Wed, 12/13/2017 - 15:22

ఖైరతాబాద్ గణేశుడికి మొదటి పూజ గవర్నర్ దంపతులు నిర్వహించారు.  63 సంవత్సరాలుగా కొలువుదీరుతున్న గణేశుడు.. ఒక్కో ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వస్తున్నాడు.   
60 అడుగులకు చేరిన గణేశుడు.. అప్పటి నుంచి ఒక్కో అడుగు దిగుతూ వస్తున్నాడు. 

ఈ ఏడాది 57 అడుగుల ఎత్తుతో కొలువుదీరాడు గణనాధుడు. గణేశుడికి కుడివైపున మహాకాల సదాశివుడు.. ఎడమ వైపు మైసాసుర వర్ధిని అమ్మవారు ఉన్నారు. కైలాసం నుంచి దిగినవచ్చినట్లు ప్రతిమ కనిపిస్తోంది. వటవృక్షం కింద ఉన్నట్లు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 

ఈ ఏడాది శ్రీచండీకుమార అనంత మహా గణపతిగా దర్శనం ఇస్తున్నారు ఖైరతాబాద్ గణనాధుడు. భారీ విగ్రహం దగ్గర చండికుమారుడు, అనంత మహాలక్ష్మి భారీ రూపాలను ప్రతిష్టించారు నిర్వాహుకులు.
దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ఆరు దశాబ్దాల చరిత్ర... అరవై అడుగుల నిండైన రూపం. చారిత్రక భాగ్యనగరి సిగలో ఓ కలికితురాయిగా నిలుస్తున్నారు ఖైరతాబాద్ గణేశుడు. 1957లో స్వాతంత్య్ర సమరయోధుడు సింగారి శంకరయ్య తొలిసారి ఖైరతాబాద్ గణేశుడి మండపంలో ఒక్క అడుగు గణపతి ప్రతిమను ప్రతిష్ఠించాడు. నాటి నుంచి ప్రతి ఏడాది ఒక్కో అడుగు పెంచుతూ 60 అడుగల మహాగణపతిని తయారు చేసి ఎత్తైన విగ్రహాల రూపకల్పనలో నూతన ఒరవడిని ప్రపంచానికి పరిచయం చేశారు. 

English Title
srichandi-kumara-mahaganapathi-khairatabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES