భోళాశంకరుడికి నైవేద్యంగా చేపల కూర

Submitted by admin on Wed, 12/13/2017 - 15:48

సాధారణంగా ఏగుడిలోనైనా దేవుడికి భక్తులు రకరకలా నైవేద్యాలు సమర్పించుకుంటారు. కొన్నిచోట్ల పులిహోర, మరికొన్ని చోట్ల దద్దోజనం ఇలా సమర్పించి భక్తితో పూజలు చేస్తారు.  వేదాంత శివుడు... .. నిరాడంబరుడు...త్రినేత్రుడు... దిగంబరుడు...బోళాశంకరుడు... వరప్రదాత... అర్ధనారీశ్వరుడు... అభిషేకప్రియుడు... శివుడు అని మనం పిలిచే శివుడికి నైవేద్యంగా ఆయనకు ఇష్టమైన  దద్దోజనం, ఎండు ఖర్జూరం, కొబ్బరికాయ,కిస్మిస్ పండ్లు,ద్రాక్ష పండ్లు, పులిహోర దద్దోజనం, పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం. కానీ అక్కడమాత్రం ఈ భోళా శంకరుడికి మాంసాహారం అయిన చేపల పులుసును ప్రసాదంగా పెడుతుంటారు. 
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలో భక్త కన్నప్ప శివుడుకి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని ప్రసాదంగా సమర్పించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ పురాణాల ఆధారంగా ఈ ఆలయంలో కూడా పరమ శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. 
మహా శివరాత్రి సందర్భంగా  గుంప సోమేశ్వర ఆలయంలో జరిగే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భోళా శంకరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆ చేపల కూరని సమర్పిస్తారు. అంతేకాదు భక్తులు ఎవరైనా సరే చేపల కూరను శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే కోరికలు తీరుతాయనేది అక్కడి భక్తుల నమ్మకం చెందింది.

English Title
sri-someswara-swamy-temple-komarada

MORE FROM AUTHOR

RELATED ARTICLES