మరో బాంబు పేల్చిన శ్రీరెడ్డి

Submitted by arun on Fri, 04/13/2018 - 11:34
srireddy

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని, తాను కూడా బాధితురాలినేనంటూ పోరాటం సాగిస్తోన్న నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని టాలీవుడ్‌లో కొందరు వ్యక్తులు ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు నాశనం చేస్తున్నారని టాలీవుడ్‌లో శ్రీరెడ్డి మరో బాంబు పేల్చారు. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించారు. 

వాకాడ అప్పారావు వందలాది మంది అమ్మాయిలను వాడుకున్నాడని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టింది. 16 సంవత్సరాల చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టలేదని ఆరోపించింది."మెగాస్టార్ చిరంజీవి గారూ... ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి" అని విజ్ఞప్తి చేసింది. తన ట్వీట్ కు వాకాడ అప్పారావు ఫొటోను జత చేసింది. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. 

English Title
sri reddy tweets on megastar chiranjeevi

MORE FROM AUTHOR

RELATED ARTICLES