శ్రీరెడ్డి లీక్స్: అమెరికా కేసులో ఎవరున్నారో నాకు తెలుసు!

Submitted by arun on Mon, 06/18/2018 - 11:29
sri

అమెరికాలో బయటపడ్డ తెలుగు సినీ సెక్స్‌ రాకెట్‌కి సంబంధించి తనకెలాంటి సంబంధం లేదంటోంది శ్రీరెడ్డి. 'ఆ రాకెట్‌లో నేను లేను' అని చెబుతూనే, శ్రీరెడ్డి ఓ హీరోయిన్‌ గురించిన క్లూ ఇచ్చేసింది. ఓ టీవీ యాంకర్‌ పేరునీ పరోక్షంగా ప్రస్తావించింది. ఆదివారం మెగా కుటుంబంలోని ఓ హీరోతో నటించిన ఓ హీరోయిన్‌తో పాటు ఓ టీవీ యాంకర్ గురించి ప్రస్తావించిన శ్రీరెడ్డి.. కొద్ది గంటల్లోనే ఆ కామెంట్‌ను డిలీట్ చేసేసింది. అది డిలీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మరో కామెంట్‌ పోస్ట్ చేసింది. ఈ సారి తన పోరాటాన్ని వ్యతిరేకించిన ఓ నటి గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది. అమెరికా వ్యభిచారం కేసులో ఎవరెవరు ఉన్నారో తనకు తెలుసని తెలిపింది. 

‘‘అమెరికాలో, ఇండియాలో సంచలనం సృష్టిస్తున్న వ్యభిచారం కేసులో వర్క్ చేసినవారిలో పెద్ద, చిన్న నటీమణుల నుంచి యాంకర్ల వరకు నాకు తెలుసు. దీని గురించి నేను సీఎన్‌ఎన్ ఐబీఎన్ చానెల్‌తో కూడా మాట్లాడాను. కిషన్ అలియాస్ శ్రీరాజ్, చంద్ర కళ అలియాస్ విభజయం ఇద్దరు రక్తం తాగే జలగలు. ఇక్కడ పతివ్రతల ముసుగులో నా మీద, నా పోరాటం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన కొంతమంది నటీమణుల జాతకాలు తొందర్లోనే బయటకు వస్తాయి. అమ్మాయిలను వేదించుకుని తిన్నవారికి కఠిన శిక్ష పడాలి. నేను ఆ రోంపిలో లేనని ఎంతో గర్వంగా చెబుతున్నా’’ అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో ఆమె ఎవరిని టార్గెట్ చేసుకుందో అందరికీ అర్థమవుతోంది. ఓ తెలుగు దిన పత్రికలో కూడా శ్రీరెడ్డిని వ్యతిరేకించిన ఓ నటీమణి కోసం పరోక్షంగా ప్రస్తావనకు వచ్చింది. దీంతో శ్రీరెడ్డికి అవకాశం చిక్కినట్లయ్యింది.

English Title
sri reddy shocking comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES