శేఖర్ కమ్ములకు శ్రీరెడ్డి వార్నింగ్

Submitted by arun on Wed, 04/04/2018 - 12:44
Sri Reddy

శేఖర్ కమ్ముల అని పేరేమీ పెట్టకుండా ఆయన పేరు ధ్వనించేలా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఇలాంటి వ్యాఖ్యల్ని ఇగ్నోర్ చేస్తే పోయేదేమో? కానీ మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే జనాలు ఇందులో నిజం ఉందని భ్రమిస్తారేమో అని కమ్ముల కొంచెం ఘాటుగానే స్పందించాడు. క్షమాపణ చెప్పు లేదా లీగల్ యాక్షన్ కు రెడీగా ఉండు అంటూ హెచ్చరించాడు కమ్ముల. దీంతో శ్రీరెడ్డి డౌన్ అవుతుందనుకున్నారు చాలామంది. కానీ ఆమె మాత్రం ఘాటుగానే స్పందించింది. అయితే శేఖర్ కమ్ముల ఫేస్‌బుక్‌లో తనను ఉద్దేశించి పెట్టిన పోస్ట్‌పై శ్రీరెడ్డి ఘాటైన కౌంటర్ ఇచ్చింది. శేఖర్ కమ్ములకు మద్దతుగా తనపై ఎవరైనా పిచ్చిపిచ్చి కామెంట్లు పెడితే ఊరుకునేది లేదని శ్రీరెడ్డి హెచ్చరించింది.
 
తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఇష్టమొచ్చిందని రాసుకుంటానని చెప్పింది. అయినా ‘నీ పేరు ప్రస్తావించానా.. లేక నీ సినిమా ప్రస్తావించానా.. జైల్లో పెట్టిస్తానంటున్నావు’ అని శేఖర్ కమ్ములను ఉద్దేశించి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. ‘చట్టపరంగా చర్యలు తీసుకుంటావా.. ఎవరొద్దన్నారు.. వెళ్లు’ అని శేఖర్ కమ్ములకు కౌంటర్ ఇచ్చింది. ‘నువ్వు శేఖర్ కమ్ముల ఐతే ఏంటి నాకు.. భయమా’ అని శ్రీరెడ్డి బదులిచ్చింది. తప్పు చేయకపోతే మాట్లాడొద్దని ఆమె చెప్పింది. తన దగ్గర బలమైన ఆధారాలున్నాయని.. చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది. త్వరలో ఒక్కొక్కరికి నోటీసులు వెళతాయని చెప్పింది.   
 

English Title
Sri Reddy Reacted On Sekhar Kammula tweets

MORE FROM AUTHOR

RELATED ARTICLES