ప్రముఖ దర్శకుడి పేరు బయటపెట్టి బాంబు పేల్చిన శ్రీరెడ్డి

Submitted by arun on Mon, 04/02/2018 - 12:57
srireddy

టాలీవుడ్ లో హీరోయిన్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది హీరోయిన్ శ్రీరెడ్డి. తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

"పెద్ద డైరెక్టర్ అని పోజు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖర్" అంటూ శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 

English Title
Sri Reddy posts the director name of casting couch celebrity

MORE FROM AUTHOR

RELATED ARTICLES