దిల్ రాజుపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

Submitted by arun on Wed, 04/11/2018 - 16:15
sri reddy leaks

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న నటి శ్రీ రెడ్డి తాజాగా నిర్మాత దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అనూహ్యంగా నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని, ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని ఆరోపించింది. ‘కుల రాజకీయాలు వద్దన్నా. ఆడ పిల్లలన్నా. బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ... ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా... టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి’ అని శ్రీరెడ్డి పేర్కొంది. 

English Title
sri reddy fb post against producer dilraju

MORE FROM AUTHOR

RELATED ARTICLES