బ్రేకింగ్: భయ్యాజీ మహరాజ్ ఆత్మహత్య

Submitted by arun on Tue, 06/12/2018 - 15:36
bhayyuji maharaj

ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు భయ్యాజీ మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. తన గన్‌తో షూట్ చేసుకున్నారు. ఇది గమనించిన ఆప్తులు ఆయనను ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. కానీ అప్పటికే ఆయన తుది శ్వాస విడిచారు. భయ్యాజీ మహరాజ్ ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు అత్యంత ఆప్తుడైన భయ్యాజీ మహరాజ్ గత కొంత కాలంగా ఆధ్యాత్మిక జీవితాన్నిగడుపుతున్నారు. 2016 నుంచి ప్రజాజీవితానికి దూరంగా ఉంటున్నారు. మహారాష్ట్రలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ షాకింగ్ న్యూస్ తెలియడంతో భయ్యాజీ మహరాజ్ అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. రంగంలో దిగిన పోలీసులు జనాన్ని అదుపు చేస్తున్నారు. మరోవైపు ఆయన ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English Title
Spiritual Leader Bhaiyyu Maharaj Shoots Himself In Head, Commits Suicide

MORE FROM AUTHOR

RELATED ARTICLES