ఏప్రిల్‌ 5 తర్వాత ఏం జరగనుంది?

Submitted by arun on Thu, 03/29/2018 - 13:40
babujagan

ఎనిమిది రోజులు గడిచిపోయాయి... ఇంకా మిగిలింది నాలుగు రోజులే... మరి ఈ 4 రోజుల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? తీర్మానాలిచ్చిన కాంగ్రెస్‌‌, టీడీపీ, వైసీపీ ఏం చేయబోతున్నాయి? ఢిల్లీ టూర్‌‌లో చంద్రబాబు ధర్నాకు దిగుతారా? పవన్‌ కల్యాణ్‌ ఆమరణ దీక్షకు దిగుతారా? రాజీనామాలు చేశాక వైసీపీ ఏం చేస్తుంది?

పార్లమెంట్‌లో హోదా పోరు క్లైమాక్స్‌కి చేరింది. ఇప్పుడు అందరి చూపూ ఏప్రిల్‌ ఐదుపైనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్‌ 5 తర్వాత పార్లమెంట్‌ నిరవధిక వాయిదా పడుతుంది... అయితే అవిశ్వాసంపై చర్చ జరగకుండానే ఇప్పటికే ఎనిమిది రోజులు గడిచిపోయాయి... ఇంకా మిగిలింది నాలుగు రోజులే... మరి ఈ 4 రోజుల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? తీర్మానాలిచ్చిన కాంగ్రెస్‌‌, టీడీపీ, వైసీపీ ఏం చేయబోతున్నాయి.

కారణం ఏదైనా అవి‌శ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టేందుకు కేంద్రం వెనకడుగు వేస్తోంది. మరి అవిశ్వాసంపై చర్చ జరగకపోతే వైసీపీ, టీడీపీ నెక్ట్స్‌‌ స్టెప్‌ ఏంటి? కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఏం చేయబోతున్నాయి? వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే... ఆమోదం పొందుతాయా? చంద్రబాబు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఢిల్లీ టూర్‌‌లో చంద్రబాబు ధర్నాకు దిగుతారా? లేక జపాన్‌ తరహా నిరసనలతోనే సరిపెడతారా? ఇక జనసేన అధినేత వ్యూహం ఎలా ఉండబోతోంది? ముందుగా ప్రకటించిన విధంగా పవన్‌ కల్యాణ్‌ ఆమరణ దీక్షకు దిగుతారా? లేక మాటలకే పరిమితమవుతారా?

కావేరి బోర్డు కోసం పోరాడుతోన్న అన్నాడీఎంకే తమ పోరును మరింత ఉధృతం చేయడంతో లోక్‌సభ సజావుగా సాగే అవకాశమే కనిపించడం లేదు. సభ ఆర్డర్‌లో లేకపోతే చర్చ చేపట్టే ప్రసక్తే లేదని స్పీకర్‌ తేల్చిచెప్తుండటంతో అవిశ్వాసంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. దాంతో హోదా పోరు ఢిల్లీ నుంచి గల్లీకి మారడం ఖాయంగా కనిపిస్తున్నా... ఏ పార్టీ ఏవిధంగా వ్యవహరిస్తుందో చూడాలి.

English Title
Special Status Increase Tension In AP Political Parties

MORE FROM AUTHOR

RELATED ARTICLES