ఢిల్లీలో టీడీపీ హోదా పోరు

Submitted by arun on Mon, 04/09/2018 - 10:52
TDP MPs

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎంపీలు ఢిల్లీలో పోరు ఉధృతం చేశారు. నిన్న ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన టీడీపీ ఎంపీలు ఈ ఉదయం మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ఉదయం ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఎంపీలు జాతిపితకు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేపట్టిన శాంతియుత పోరాట బాటలోనే తామూ పోరాడుతామని టీడీపీ ఎంపీలు తెలిపారు. విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం వ్యవహరించకూడదన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నామని, రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కేవరకు పోరుబాట విడిచేది లేదని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు.

English Title
Special Status to AP | TDP MPs Continue to Fight at Delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES