స్పీకర్‌కు తప్పిన పెనుప్రమాదం

Submitted by arun on Sat, 06/09/2018 - 14:22
Accident

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తన నియోజవర్గంలోని గణపురం శివారులో స్పీకర్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. గణపురం నుంచి భూపాలపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లా గణపురంలో స్పీకర్ మధుసూదనాచారి రాత్రి పల్లె నిద్ర చేశారు. గ్రామ పర్యటనను ముగించుకుని తిరిగి వస్తుండగా దేవాదుల పైపులను తీసుకువస్తున్న రెండు లారీలు ఎదురుగా వస్తున్న స్పీకర్ కాన్వాయ్ వాహనాలను ఢీకొట్టాయి. బలంగా ఢీకొట్టడంతో వాహనం రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు స్పీకర్‌ను క్షేమంగా గమ్యానికి చేర్చారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగంగా నుజ్జనుజ్జు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పీకర్‌కు ఫోన్ చేసి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 

English Title
speaker madhusudhana chary narrowly escapes accident

MORE FROM AUTHOR

RELATED ARTICLES