ఫిలింఫేర్ అవార్డులు-2018

ఫిలింఫేర్ అవార్డులు-2018
x
Highlights

దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుక ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన బాహుబలి2 చిత్రానికి అవార్డుల...

దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుక ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన బాహుబలి2 చిత్రానికి అవార్డుల పంట పండాయి. ఉత్తమ చిత్రం తోపాటు ఈ చిత్రం మొత్తం ఎనిమిది కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. అర్జున్‌ రెడ్డికి చిత్రానికిగానూ ఉత్త‌మ నటుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ, క్రిటిక్స్‌ విభాగంలో వెంకటేష్‌ దగ్గుబాటి గురు చిత్రానికి, ఫిదా చిత్రానికిగానూ ఉత్త‌మ న‌టిగా సాయి ప‌ల్ల‌వి అవార్డులు దక్కించుకున్నారు. ఇక రాజ‌మౌళికి బాహుబ‌లి-2కి ఉత్తమ దర్శకుడిగా,సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డు దక్కింది.

అవార్డులు..

  • ఉత్తమ చిత్రం - బాహుబలి 2
  • ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2)
  • ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)
  • ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ (అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు), ఫిదా( వచ్చిండే )
  • ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్)
  • జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ
  • ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్)
  • ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్)
  • ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా)
  • ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు)
  • ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2)
  • ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2)
Show Full Article
Print Article
Next Story
More Stories