శ్రీరెడ్డికి ఊహించని వారి నుంచి మద్దతు..!

Submitted by arun on Mon, 04/09/2018 - 13:06
srireddy

టాలీవుడ్ లో తెలుగు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పై ప్రత్యక్ష పోరాటానికి దిగిన హీరోయిన్ శ్రీరెడ్డికి మద్దతు పెరుగుతోంది. తాజాగా ఆమెకు ఊహించని మద్దతు లభించింది. శ్రీరెడ్డికి తాము మద్దతుగా ఉంటామని సౌత్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు.  ఆదివారం తార్నాకలోని సౌత్‌ ఇండియా స్టూడెంట్ జేఏసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాది సినీ తారలకు దక్షిణాది సినీ పరిశ్రమలో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం వలన దక్షిణాది సినీ తారాలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సినీ నిర్మాతలు దక్షిణాది తారల పట్ల ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్‌లో సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సౌత్‌ ఇండియా స్టూడెంట్‌ జేఏసీ అధ్యక్షుడు గడ్డం అశోక్‌, అశోక్‌ నాయక్‌ పాల్గొన్నారు.
 

Tags
English Title
south indian students chairman support srireddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES