త్వరలో 'వినయ విధేయ రామ' నుంచి ఫస్ట్ సాంగ్

Submitted by chandram on Sat, 12/01/2018 - 12:43
Vinayya Vidya Rama

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'వినయ విధేయ రామ'. ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే కాగా ఇటివలే విడుదల చేసిన టీజర్‌కు తెగా ఆధారణ లభించింది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదుఅనుకో అంతగా టీజర్ అభిమానులను ఉర్రుతలుగించింది. అయితే విరయ విధేయ రామ నుండి మొదటి పాటను కూడా విడుదల చేయడానికి చిత్రం బృందం సన్నాహాలు చేస్తుంది. డిసెంబర్ 3 సోమవారం రోజున వినయ విధేయ రామ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు చేయనున్నారు. అదే రోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపారు. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అయితే వినయ విధేయ రామ సినిమాలో దేవి శ్రీ సంగీతం ఏస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది

English Title
Soon, the first song from 'Vinayya Vidya Rama'

MORE FROM AUTHOR

RELATED ARTICLES