డ్రైవింగ్ లైసెన్స్‌కూ ఆధార్‌ను లింక్ చేయాలి: కేంద్రం

డ్రైవింగ్ లైసెన్స్‌కూ ఆధార్‌ను లింక్ చేయాలి: కేంద్రం
x
Highlights

ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేయడానికి వచ్చే ఫిబ్రవరిని డెడ్‌లైన్‌గా విధించిన కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సులకు కూడా...

ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేయడానికి వచ్చే ఫిబ్రవరిని డెడ్‌లైన్‌గా విధించిన కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. డిజిటల్ హర్యానా సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి గడ్కరీతో ఆధార్- డ్రైవింగ్ లైసెన్స్ అనుసంధానం గురించి మాట్లాడటం జరిగిందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అయితే ఎప్పటి నుంచి ఈ అనుసంధాన ప్రక్రియ మొదలవుతుందో.. ఎప్పటికి పూర్తవుతుందో తేదీలను మాత్రం మంత్రి ప్రకటించలేదు. త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. నవంబర్ నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆధార్‌ను పలు కార్డులకు అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories