ట్రైలర్‌కు బదులు పూర్తి సినిమాను అప్‌లోడ్ చేశారు...

Submitted by arun on Wed, 07/04/2018 - 16:40
movie

సోని పిక్చర్స్ తప్పులో కాలేసింది. తాము నిర్మించిన ఖలి ద కిల్లర్ అనే మూవీ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాల్సింది పోయి మొత్తం సినిమానే పెట్టేశారు. జూలై 3న సోనీ తన యూట్యూబ్ ఛానల్‌లో ‘రెడ్ బ్యాండ్’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్‌కు బదులు పొరపాటున జాన్ మాథ్యూస్ డైరెక్షన్‌లో.. రిచర్డ్ కాబ్రల్ లీడ్ రోల్ ఫోషించిన.. ‘ఖాళీ ది కిల్లర్’ అనే 89 నిమిషాల పూర్తి సినిమాను అప్‌లోడ్ చేసింది. దీనిని గమనించిన సీబీఆర్.కమ్ అనే వెబ్‌సైట్ వెంటనే సదరు నిర్మాణ సంస్థకు విషయాన్ని తెలిపింది. అప్పటికే ఆ సినిమా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయి 8గంటలు. అప్పటికే చాలామంది యూట్యూబ్‌లో ఆ సినిమాను చూసేశారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ మూవీ రెంటల్ బేసిస్‌పై అందించేందుకు సోనీ సంస్థ చర్యలు తీసుకుంది.

English Title
Sony tries to upload movie trailer to YouTube, posts entire movie instead

MORE FROM AUTHOR

RELATED ARTICLES