సోనియా రాకతో ప్రజాకూటమికి కొత్త ఊపు..

సోనియా రాకతో ప్రజాకూటమికి కొత్త ఊపు..
x
Highlights

మేడ్చల్ సభ గ్రాండ్‌ సక్సెస్‌తో సరికొత్త జోష్‌ నింపిందని కూటమి నేతలు సంబరపడిపోతున్నారు. సభా వేదికగా ప్రజాకూటమి పార్టీలు తొలిసారి ఆసీనులయ్యాయి. అటు...

మేడ్చల్ సభ గ్రాండ్‌ సక్సెస్‌తో సరికొత్త జోష్‌ నింపిందని కూటమి నేతలు సంబరపడిపోతున్నారు. సభా వేదికగా ప్రజాకూటమి పార్టీలు తొలిసారి ఆసీనులయ్యాయి. అటు కాంగ్రెస్‌ హేమాహేమీ నాయకులు, ఇటు తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ముఖ్య నాయకులు స్టేజ్‌ మీద ఉండటం, కూటమి పార్టీల కార్యకర్తలకు కొత్త జోష్‌ నింపిందని భావిస్తున్నారు. సీట్ల గొడవలను పక్కనపెట్టి, అందరూ ఏకం కావడంతో, క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణుల ఐక్యతకు ఊపునిస్తుందని, పార్టీల మధ్య ఓట్ల బదలాయింపుకు ఊతమిస్తుందని, కూటమి పక్షాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలో నేపథ్యంలో నిర్వహించిన తొలి భారీ సభ మహాకూటమి ప్రచారన్ని ములుపుతిప్పిందని నేతలు చెబుతున్నారు. కూటమి భాగస్యామ్య పక్షాల మధ్య సీట్ల పంపీణీల జాప్యం, అసంతృప్తులు, పోటీలు, నిరసనలు ఎన్నింటినో సోనియా రాకతో మేడ్చల్ సభ తుడిచిపెట్టిందని నేతలు చెబుతున్నారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ పాత్ర ఎంత కీలకమైందో, ఎన్ని ఒత్తిళ్ల మధ్య రాష్ట్రం సాకారమైందో భావోద్వేగంగా మాట్లాడారు సోనియా. క్లిష్టమని తెలిసినా, ఆంధ్రాలో పార్టీకి నష్టమని అర్థమైనా, ఆఖరికి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు. ఈ మాటలతో తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసేనన్న మాటలను, ప్రజలకు గట్టిగా వివరించాలని భావిస్తున్నారు కార్యకర్తలు. రాహుల్‌ అటాకింగ్ స్పీచ్‌ కూడా, శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని భావిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories