సోనియాగాంధీ సంచలన నిర్ణయం

Submitted by arun on Sat, 12/16/2017 - 11:32

సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు నిర్వహించిన సోనియా గాంధీ ఇక శెలవు తీసుకుంటానంటున్నారు కుమారుడు రాహుల్ కి పార్టీ బాధ్యతలు అప్పగించాక తాను రెస్ట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమె క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతారని చెబుతోంది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అలసి పోయారా? ఇక క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? శీతాకాల పార్లమెంటు సమావేశాల ఆరంభం తొలిరోజునే సోనియా గాంధీ ఈ సంచలన ప్రకటన చేశారు కుమారుడు రాహుల్ శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా  పూర్తిస్థాయిలో అధికారికంగా బాధ్యతలు చేపడుతున్న దృష్ట్యా సోనియా ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆమెది  చెప్పుకోదగిన ప్రస్థానం భర్త రాజీవ్ మరణానంతరం ఏడేళ్ల తర్వాత విధిలేని పరిస్థితుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.. రాజీవ్ వారసురాలిగా 1998లో పార్టీ బాధ్యతలు తీసుకోడానికి ముందు వరకూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పరమ ఘోరంగా తయారైంది నెహ్రూ, గాంధీ వారసత్వం లేనిదే పార్టీ మనుగడ సాగించలేని దుస్ధితి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న సోనియా పార్టీ సీనియర్ల విన్నపం మేరకు బాధ్యతలు స్వీకరించారు.. ఆమె సారధ్యంలో 2004 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీల సహకారంతో యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

యూపిఏ సంకీర్ణానికి నేతృత్వం వహించిన సోనియా కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, ఫుడ్ సెక్యూరిటీ బిల్లు, లాంటి నిర్ణయాలు తీసుకునేలా పార్టీకి దిశానిర్దేశం చేశారు 1999లో 13వ లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు అప్పట్లో సోనియాని ప్రధానిని చేయాలని పార్టీలో ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నించినా విదేశీయత ఆమెకు అడ్డంకిగా మారింది. విపక్షాలకు తోడు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2004 ఎన్నికలకు ఆమ్ ఆద్మీ నినాదంతో పార్టీని ఎన్నికల బరిలోకి దింపిన సోనియా ఎన్నికల్లో పార్టీకి సంపూర్ణ మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలన్నీ ఆమె చేతుల మీదే సాగిపోయాయి విజ్ఞుడు, అనుభవజ్ఞుడు, మేధావి, మితభాషి అయిన మన్మోహన్ ను ప్రధానిగా నియమించి తెర వెనకనుంచే ఆమె చక్రం తిప్పారు కాంగ్రెస్ పార్టీ గెలుపు , ఓటములకు, వ్యవహార శైలికీ అన్నింటికీ ఆమె బాధ్యత వహిస్తూ అడుగులేశారు. ఇప్పుడిక కుమారుడికి బాధ్యతలు అప్పగించాక రాజకీయాలనుంచి తప్పుకుంటానని సోనియా ప్రకటించారు ఆడిన మాట తప్పనని, ఇచ్చిన మాట నెరవేర్చుతాననీ చెప్పే సోనియా అన్నట్లుగానే 2014 లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఆ రాష్ట్ర  ప్రజల ఆదరాభిమానాలను సంపాదించారు.

మేనిఫెస్టోలో పెట్టినందున తెలంగాణను ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారి కల్పించారు. కొన్నేళ్లుగా గర్భాశయ ముఖద్వార కేన్సర్ తో బాధపడుతూ విదేశాల్లో చికిత్స కూడా తీసుకుంటున్నారు వయసు మీద పడటం. అనారోగ్యం కారణంగానే కుమారుడికి పార్టీ బాధ్యతలు కట్టబెట్టారు.

English Title
Sonia Gandhi retires as India Congress party president

MORE FROM AUTHOR

RELATED ARTICLES