వ్యవసాయ బడ్జెట్‌లో ప్రధానాంశాలు

వ్యవసాయ బడ్జెట్‌లో ప్రధానాంశాలు
x
Highlights

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంద్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు....

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంద్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ బడ్జెట్‌ను ఈరోజు ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు.

- రూ.19 వేల కోట్లతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
- ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- 2022 రైతు ఆదాయం రెట్టింపు దిశగా పనిచేస్తున్నాం
- ఉత్పాదకత పెంచుతూ.. సాగు ఖర్చులు తగ్గించేందుకు కృషి
- రైతు ముఖంలో సంతోషం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
-29 శాతం అధికంగా మొక్కజొన్న ఉత్పత్తి
- అత్యధిక ఉత్పాదకత సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం
- సరైన ప్రణాళికలతో రైతుల ఆదాయాన్ని సుస్థిర పరిచాం
- ప్రతీ రైతుకు భూసార కార్డులు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం
- మొదటి విడతలో రైతులకు 54.27 లక్షల కార్డులు అందించాం
- ఈ పథకం అమలులో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది
-100 శాతం రాయితీతో రైతులకు సూక్ష్మ పోషకాలు అందిస్తున్నాం
- ఆధార్ అనుసంధానం ద్వారా రాయితీ విత్తనాలు పంపిణీ చేస్తున్నాం
- రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టాం
- ఇందు కోసం కర్నూలు జిల్లా తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశాం
- మెగా సీడ్ పార్క్ కోసం రూ.100 కోట్ల కేటాయింపు
- 90 శాతం రాయితీతో వేరుశనగ విత్తనాలు సరఫరా చేశాం
- ఉత్తరాంధ్రలో ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశాం
- రాష్ట్రాన్ని ఆర్గానిక్ హబ్‌గా మార్చే దిశగా వెళ్తున్నాం
- 2022 నాటికి 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు లక్ష్యం
- 5 లక్షల మంది రైతులను భాగస్వాములను చేస్తాం
- ఉత్పాదకత పెంచే క్రమంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం
- ఉభయగోదావరి జిల్లాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశాం
- సమర్థనీటి వినియోగంతో ఉత్పాదకత పెరిగింది
- 2017-18 ఏడాదికి రుణ లక్ష్యం రూ.63 వేల కోట్లు
- రూ.60 వేల కోట్ల రుణాలు పంపిణీ చేశాం
- రుణ పంపిణీలో 91 శాతం మేర లక్ష్యం పూర్తైంది
- సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ లేకుండా రూ.లక్ష వరకు రుణం
- 7 లక్షల మంది కౌలు రైతులకు ఇప్పటి వరకు రుణాలు అందాయి
- పొలం పిలుస్తోంది, చంద్రన్న రైతు క్షేత్రాల ద్వారా రైతులకు అవగాహన
- 2017-18లో 16 లక్షల మంది రైతులు పంటల బీమా చేసుకున్నారు
- పంటల బీమాను రైతుల దగ్గరకు తీసుకెళ్లేందుకు సవరణలు చేశాం
- 2017-18లో అపరాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది
- వరి, వేరుశనగ, రాగి, మొక్కజొన్నలో అభివృద్ధి చెందిన..
17 విత్తన రకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి
- ఆంగ్రూలో ప్రాసెసింగ్ కేంద్రాన్ని నెలకొల్పాం
- వ్యవసాయ పంటల కంటే.. ఉద్యాన పంటల్లోనే ఎక్కువ ఆదాయం
- రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా మార్చేందుకు యత్నిస్తున్నాం
- కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు పెంచే దిశగా ముందుకు వెళ్తున్నాం
- రెండంకెల వృద్ధి సాధించడానికి ఉద్యాన రంగాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాం
- పంట నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు
- రాబోయే మూడేళ్లలో 1000కి పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు
- ఇందులో 10 లక్షల మంది రైతులను సభ్యులుగా చేర్చబోతున్నాం
- ఆర్.కె.వి.వై ద్వారా కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు ప్రోత్సహిస్తున్నాం
- రాష్ట్రంలో పశుగణాభివృద్ధి కోసం ఒంగోలు, పుంగనూరు జాతుల వీర్యాన్ని పంపిణీ చేశాం
- రొయ్యల ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది
- ఏపీని ప్రపంచ ఆక్వా హబ్‌గా మార్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది
- 91 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కల్గిన గోదాములు నిర్మాణంలో ఉన్నాయి
- ఈ-నామ్ మార్కెట్లలో నాణ్యతా ప్రమాణాలు నిర్ణయించే ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం
- ఏడు గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
- భూగర్భజలాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
- పంట సంజీవని ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో పంటను గట్టెక్కించేందుకు యత్నిస్తున్నాం

Show Full Article
Print Article
Next Story
More Stories