శరీర బరువును తగ్గించుకోవడానికి ఈ పద్ధతులు పాటించండి

Submitted by lakshman on Sat, 09/16/2017 - 16:47

మీరు బరువుని తగ్గించుకోవాలి అనుకుంటున్నారా.. దాని కోసం పాటించే నియామాలను ప్రేమతో,ఇష్టంతో పాటించండి.  పొట్ట చుట్టు కొవ్వు అధికంగా ఉండటం వలన నిరాశ చెందటమే కాకుండా, ప్రమాదకరమైన డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తొలగించుకోవటం చాలా కష్టం. నడుము చుట్టు ఉన్న కొవ్వు కరిగి పోవాలంటే, జీవన శైలిలో కోన్ని మార్పులు మరియు తీసుకునే ఆహరంలో మార్పులు తప్పని సరిగా అవసరం. త్వరగా మీ శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించుకోటానికి ఇక్కడ ఇచ్చిన అంశాలను అనుసరించండి.

మంచి ఆహార ప్రణాళికను తయరు చేసుకోండి
మంచి ఆహారం బరువు తగ్గటంలో ముఖ్య పాత్రని పోషిస్తుంది. బరువు తగ్గటానికి అనుసరించే మందులతో పాటూ, మీ ఆహరం కోసం తయరు చేసుకున్న ప్రణాళికను కూడా అనుసరించటం వలన ఆరోగ్యవంతమైన శరీరాకృతిని పొందుతారు. ఒక వేళ మీరు తీసుకొనే ఆహరంలో కొవ్వు, ఎక్కువ క్యాలరీలు, సోడియం వంటివి ఉన్నట్లయితే బరువు తగ్గటం చాలా కష్టం.

ఎక్కువ నీటిని త్రాగండి
మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరము. మీరు నీటిని ఎక్కువగా తీసుకోండి. దీని వలన శరీరం నిర్వీషీకరణకు గురి కాకుండా ఉంటుంది. క్యాలరీలు తీసుకోవటాన్ని తగ్గించడం వలన బరువు తగ్గిపోతుంది.

ఆహార నియమాలను పాటించండి
వ్యాయామాలు చేయకుండా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గించుకోవటం చాలా కష్టం. వ్యాయామాలను చేయటానికి ఇష్టపడకపోతే, ఎరోబిక్ వ్యాయామాలు, ఇందులో జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, చురుకైన నడక వంటి వాటిని చేయండి. వారంలో మూడు సార్లు 30 నిమిషాల పాటూ నడవటం వలన జీవక్రియని నియంత్రించబడి, మీ శరీరంలోని అధిక క్యాలరీలు ఖర్చు చేయబడతాయి.

పొట్ట భాగంలో కఠినంగా అనిపించే వ్యాయామాలను చేయండి
ఎరోబిక్ వ్యాయామాలలో వారంలో 2 నుండి మూడు సార్లు, 15 నుండి 20 నిమిషాల పాటూ చేయండి. ఇలాంటి వ్యాయామ పద్ధతుల వలన నడుము పైన బరువుపడి, కొవ్వు కరిగిపోతుంది. అవే కాకుండా కూర్చోని చేసే వ్యాయామాల వలన మీరు తొందరగా బరువు తగ్గుతారు.

ఉత్సాహవంతంగా ఉండండి
మీరు ఒక రాత్రిలో లేదా వారంలో బరువు తగ్గలేరు. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరిగి పోవటానికి కొన్ని వారాలు కాకుండా కొన్ని నెలల సమయం పట్టొచ్చు. ఓపికతో ప్రయత్నించినట్లయితే, నడుము చుట్టూ ఉండే కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. మీకు ఎలాంటి శిక్షణ నిపుణులు లేదా కొవ్వుని తగ్గించే యంత్రాలు అవసరం లేదు. కొవ్వును తగ్గించుకోటానికి జీవన శైలిలో మార్పులు, వ్యాయామాలు చేస్తే సరిపోతుంది.

English Title
some weight loss tips

MORE FROM AUTHOR

RELATED ARTICLES