టీఆర్ఎస్ లో ఆ నలుగురు దురదృష్టవంతులు!

Submitted by arun on Mon, 03/12/2018 - 13:42
kcr

టీఆర్ఎస్ లో ఆ నలుగురు అనగానే.. సాధారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, మంత్రి హరీష్ గురించే అనుకుంటారు. కానీ.. ఇక్కడ ఆ నలుగురు అంటే మరో అర్థం వచ్చేసింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్లు కేటాయిస్తామని భరోసా ఇస్తూనే.. ముగ్గురు నలుగురికి మాత్రం అవకాశం దక్కకపోవచ్చని సూచన ప్రాయంగా చెప్పారు.

అలాగే.. అదే సమావేశంలో.. ఎమ్మెల్యేలు బొడిగె శోభ, గంగుల కమలాకర్ తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తీరు మార్చుకోవాలని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు కూడా సమాచారం. దీంతో.. ఈ ఇద్దరికీ టికెట్లు దక్కడం అనుమానమే అని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన నలుగురిలో ఇద్దరు తేలిపోయారనీ.. మరో ఇద్దరు ఎవరై ఉంటారని కూడా చర్చ జరుగుతోంది.

రాష్ట్రానికి మొదటి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తాటికొండ రాజయ్య తీరుపైనా.. సీఎం ఆలోచిస్తూ ఉండవచ్చని ఓ ప్రచారం ఉంది. అలాగే.. దక్షిణ తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే వ్యవహారం కూడా చాలా కాలంగా సీఎంను చికాకు పెడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా.. కనీసం నలుగురు సిట్టింగులకైతే టికెట్లు దక్కకపోవచ్చన్న మాట.. సీఎం నుంచే వచ్చే సరికి.. ఆ నలుగురు దురదృష్టవంతులు ఎవరన్నదానిపై చర్చ మాత్రం జోరుగానే నడుస్తోంది. దీనికి.. కాలమే సమాధానం చెప్పనుంది.

English Title
Some TRS MLAs may not get tickets to contest 2019 elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES