విరాట్ కొహ్లీ కంటే 52 పాయింట్లతో ముందున్న స్మిత్

విరాట్ కొహ్లీ కంటే 52 పాయింట్లతో ముందున్న స్మిత్
x
Highlights

టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్ పాయింట్లలో... ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. తన రికార్డును తానే అధిగమిస్తూ సరికొత్త...

టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్ పాయింట్లలో... ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. తన రికార్డును తానే అధిగమిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పడానికి సిద్ధమవుతున్నాడు. ఐసీసీ టెస్ట్ బ్యాట్స్ మన్
తాజా ర్యాంకింగ్స్ ప్రకారం స్మిత్...945 ర్యాంకింగ్ పాయింట్లు సాధించి....938 పాయింట్ల తన రికార్డును తిరగరాశాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల యాషెస్ సిరీస్ మొదటి మూడుటెస్టుల్లోనే...స్మిత్ సెంచరీలు, డబుల్ సెంచరీల మోత మోగించాడు. పెర్త్ లో ముగిసిన మూడోటెస్టు లో సైతం స్మిత్ 239 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పాటు...తనజట్టుకు యాషెస్ సిరీస్ విజయం ఖాయం చేశాడు. మొత్తం మూడుటెస్టుల్లో స్మిత్... 426 పరుగులతో ...142 సగటు నమోదు చేశాడు. మిగిలిన రెండుటెస్టులూ నెగ్గి.. 5-0తో క్లీన్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 961 ర్యాంకింగ్ పాయింట్లు సాధించడం ద్వారా....డాన్ బ్రాడ్మన్ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డు సాధించారు. ఈ రికార్డును అధిగమించాలంటే...స్టీవ్ స్మిత్ మరో 17 పాయింట్లు సాధిస్తే చాలు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కంటే స్టీవ్ స్మిత్ 52 పాయింట్లతో పై స్థానంలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories