ప్రియుడికోసం పిల్లలను అంతమొందించిన మహిళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

Submitted by nanireddy on Fri, 09/07/2018 - 18:50
smartphone-addict-woman-video-calls-boyfriend

ప్రియుడికోసం కడుపున పుట్టిన పిల్లలను అంతమొందించిన మహిళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల్ని హత్య చేసి ప్రియుడితో కలిసి కేరళ వెళ్లిపోయిన అభిరామి అనూహ్యంగా పోలీసులకు దొరికింది. ప్రియుడి మోజులో పడి  పిల్లల పట్ల సైకోగా మారినట్టు పోలీసుల విచారణలో అభిరామి ఒప్పుకుంది. బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారింది. భర్త ఇంట్లో లేని సమయంలో బిర్యానీ ఆర్డర్‌ చేసి, సుందరాన్ని తరచూ ఇంటికి రప్పించుకోటానని చెప్పింది. అంతేకాకుండా ఒక్కోసారి సెల్‌ఫోన్‌కు బానిస అయిన అభిరామి తన ప్రియుడితో తరచూ గంటల తరబడి వీడియో కాల్స్‌లో మాట్లాడేవారని ఆ సమయంలో అడ్డువచ్చిన పిల్లలను చిత్రహింసలకు గురి చేసేదని పోలీసులకు వివరించింది. కాగా  తన సరదాలకు అడ్డుగా ఉన్నారన్న కారణంగా సైకోగా మరి కన్న కొడుకు కూతురిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 

English Title
smartphone-addict-woman-video-calls-boyfriend

MORE FROM AUTHOR

RELATED ARTICLES