అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు

అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మహిళలకు వివిధ పార్టీలు తక్కువ సంఖ్యలో సీట్లు కేటాంచగా...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మహిళలకు వివిధ పార్టీలు తక్కువ సంఖ్యలో సీట్లు కేటాంచగా గెలుపొందిన స్థానాలకు కూడా తక్కువగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించగా తాజా ఎన్నికల్లో కేవలం ఆరుగురు మాత్రమే గెలుపొందారు.

తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరిన పలువురు మహిళల ఆశలు అడిఆశలయ్యాయి. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ అత్యధికంగా 13 మంది మహిళా అభ్యర్ధులకు సీట్లు కేటాయించగా ఒక్కరు కూడా విజయం సాధించలేదు. కాంగ్రెస్ నుంచి 11 మంది మహిళలకు టిక్కెట్లు దక్కించుకున్నారు. వీరిలో మహేశ్వరం నుంచి పోటీ చేసిన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధి తీగల కృష్ణారెడ్డిపై 7607 ఓట్లతేడాతో గెలుపొందింది. ములుగు నుంచి మంత్రి అజ్మీరా చందులాల్ పై పోటీ చేసిన సీత్క 2267 ఓట్లతో, ఇల్లందులో టీఆర్ఎస్ అభ్యర్ధి కోరం కనకయ్యపై పోటీ చేసిన హరిప్రియ నాయక్ 2907 ఓట్ల తేడాతో గెలుపొందారు.

తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ కూకట్ పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసినికి అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ తరపున మెదక్ నుంచి పద్మాదేవేందర్‌ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి ఉపేందర్ రెడ్డిపై 47,983 ఓట్ల మెజార్జీతో గెలుపొందారు. ఆలేరులో గొంగిడి సునీతా కాంగ్రెస్ అభ్యర్ధి బూడిద బిక్షమయ్యపై 33,086 ఓట్ల తేడాతో, ఖానాపూర్ నుంచి రేఖా శ్యాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్ధి రమేష్ రాథోడ్ పై 20,710 ఓట్లతో గెలుపొందారు. ఆసిఫాబాద్‌ నుంచి బరిలో నిలిచిన కోవా లక్ష్మి పరాజయం పాలయ్యారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, కొండా సురేఖలో పరాజయం పాలయ్యారు. కోదాడ నుంచి పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ సతీమణీ పద్మావతిరెడ్డి, అదిలాబాద్ నుంచి రంగంలోకి దిగిన గండ్ర సుజాత, ఆర్మూర్ నుంచి పోటీ చేసిన ఆకుల లలిత, స్టేషన్ ఘన్ పూర్ నుంచి బరిలోకి దిగిన సింగాపురం ఇందిర ఓటమి పాలయ్యారు.

బీజేపీ తరపున టిక్కెట్ పొందిన స్వర్ణారెడ్డి-నిర్మల్, అరుణతార-జుక్కల్, బొడిగె శోభ-చొప్పదండి, ఆకుల విజయ్-గజ్వేల్, షెహజాది-చాంద్రాయణగుట్ట, పద్మజారెడ్డి-మహబూబ్ నగర్, రజనీ మాధవరెడ్డి-ఆలంపూర్, కంకణాల నివేదిత నాగార్జనసాగర్, నాగ స్రవంతి, రేష్మా రాథోడ్-వైరా, కుంజా సత్యవతి-భద్రాచలం, పుప్పాల శారద-ఖమ్మం, చందుపట్ల కీర్తి రెడ్డి-భూపాలపల్లి ఓటమి చెందారు. గత మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదని విమర్శలు ఎదుర్కొన్న నేపధ్యంలో ఈ సారి టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ముగ్గురు మహిళల్లో ఒకరికైనా లభించే అవకాశాలు లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories