మ్యూజిక్ డైర‌క్టర్ ముద్దుపై కేసు న‌మోదు

Submitted by arun on Fri, 02/23/2018 - 16:07
Kissing

సంగీత దర్శకుడు, గాయకుడు పపోన్‌ మ్యూజిక్‌ రియాల్టీ షోలో పాల్గొన్న ఓ మైనర్‌ బాలికను ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు గాయకుడి తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పపోన్‌ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు న్యాయవాది రుణ భుయాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపోన్‌గా పేరుపొందిన అన్గరాగ్‌ మహంతా ఓ ఛానెల్‌ లో ప్రసారమవుతున్న వాయిస్‌ ఇండియా కిడ్స్‌ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి షాన్‌, హిమేష్‌ రేష్మియాలు కూడా జడ్జిలు. మంగళవారం ఈ షోకి హోలీ ప్రత్యేక ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా హోలీ ఆడుతూ పాపోన్‌ ఓ బాలిక ముఖానికి రంగు పూసి పెదాలపై ముద్దాడాడు. ఆ వ్యవహారమంతా ఫేస్‌ బుక్‌ లైవ్‌లో టెలీకాస్ట్‌ అయ్యింది. 

ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్‌.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో(POCSO) యాక్ట్‌ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్‌ కోరుతున్నాడు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. కాగా, విమర్శలపై పాపోన్‌ ఇంతవరకు స్పందించలేదు. అస్సామీ సింగర్‌ అయిన పాపోన్‌ బర్ఫీ, సుల్తాన్‌, దమ్‌ లగా కే హైసా.. తదితర చిత్రాలతో పాపులర్‌ అయ్యాడు.

English Title
Singer Papon Caught On Facebook Broadcast Kissing Reality Show Contestant

MORE FROM AUTHOR

RELATED ARTICLES