త్వరలో శ్రుతి హాసన్‌ పెళ్లి?

Submitted by admin on Tue, 12/12/2017 - 18:53

ప్రముఖ నటుడు కమలహాసన్ కుమార్తె శ్రుతి హాసన్ లండన్ కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమాయణంపై పలుమార్లు మీడియాలో రాగా, అవన్నీ రూమర్లు అంటూ ఈ ముద్దుగుమ్మ కొట్టిపడేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది అన్ని రూమర్లలా కాదని, సీరియస్ రిలేషన్ షిప్ అని తెలుస్తోంది. మైఖేల్‌ను శ్రుతి తన తల్లి సారికకు పరిచయం చేశారట. మైఖేల్‌, శ్రుతి, సారిక కలిసి దిగిన ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో శ్రుతి పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. శ్రుతి తన ప్రేమ గురించి ఎప్పుడూ మీడియా ముందు నేరుగా చెప్పలేదు. కానీ, తన వ్యక్తిగత విషయాలను అందరితో చెప్పుకోవడం తనకు నచ్చదని చెపుతూనే, పరోక్షంగా ప్రేమ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మైఖేల్‌ని తన తల్లికి పరిచయం చేశారు కాబట్టి, త్వరలోనే శ్రుతి పెళ్లికబురు వినిపించనున్నట్లు తెలుస్తోంది.

English Title
shruti-hassan-wedding-soon

MORE FROM AUTHOR

RELATED ARTICLES