మార్చిలో శ్రియ పెళ్లి..?

మార్చిలో శ్రియ పెళ్లి..?
x
Highlights

37 ఏళ్ళ వ‌య‌స్సులోను తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న గ్లామర్ బ్యూటీ శ్రియ. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటిన ఇప్పటికి ఈ...

37 ఏళ్ళ వ‌య‌స్సులోను తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న గ్లామర్ బ్యూటీ శ్రియ. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటిన ఇప్పటికి ఈ అమ్మడు అభిమానులకి కొత్తగానే కనిపిస్తుంటుంది. ఇటీవల గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్టి దేవిగా నటించిన శ్రియ తన నటనతో ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ బాల‌య్య‌తో పైసా వ‌సూల్ చేసింది. ప్ర‌స్తుతం గాయ‌త్రి అనే సినిమాలో విష్ణు స‌ర‌స‌న న‌టిస్తుంది . ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. అయితే ఇటు తెలుగు, అటు త‌మిళంలో మంచి నటిగా పేరుతెచ్చుకున్న శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల పరిచయం అయిన ఓ రష్యన్‌ యువకుడితో శ్రియ సన్నిహితంగా ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. ఆ యువకుడినే వచ్చే నెలలో వివాహమాడేందుకు రెడీ అవుతుందట. తన విషయంపై అబ్బాయి తరపు వారితో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యా వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. డెహ్రడూన్‌ కు చెందిన ఈ భామ డెస్టినేషన్‌ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ లో శ్రియ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయిట. అయితే ఈ విషయంపై శ్రియ తరపు నుంచి ఎలాంటి అధికారిక సమాచరం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories