డైరెక్టర్ యోగి కేసు.. కీలక మలుపు

డైరెక్టర్ యోగి కేసు.. కీలక మలుపు
x
Highlights

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి కేసు కీలక మలుపు తిరిగింది. తన పట్ల యోగి అభ్యంతరంగా ప్రవర్తించాడని ఓ హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ అడిషనల్ డీసీపీ...

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి కేసు కీలక మలుపు తిరిగింది. తన పట్ల యోగి అభ్యంతరంగా ప్రవర్తించాడని ఓ హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి హీరోయిజాన్ని ప్రదర్శించాడు. డైరెక్టర్‌ యోగిని కాలుతో తన్నిన వీడియో మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

తన పట్ల డైరెక్టర్ యోగి అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్‌ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి తమదైన శైలిలో యోగికి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో యోగిని గంగిరెడ్డి బూటుతో తన్నారు. కౌన్సిలింగ్‌ పేరుతో పీఎస్‌కు పిలిచి మరీ చితకబాదారు.

ఈ ఘటనపై యోగి మీడియాతో మాట్లాడుతూ .. ‘‘పోలీసులు నన్ను బెదిరించారు. అకారణంగా అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి నన్ను కొట్టారు. హారికతో మూడేళ్ల నుంచి స్నేహం ఉంది. హారిక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది’’ అని యోగి ఆరోపించారు.

యోగి ఆరోపణలపై హారిక స్పందించారు. యోగి తనను వేధించినందుకే ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. యోగిపై గతంలో కూడా కేసులు ఉన్నాయని, యోగికి అప్పుడప్పుడు ఆర్ధికసాయం కూడా చేశానని హారిక వెల్లడించారు. యోగి తన గురించి తప్పుడు ప్రచారం చేశాడని హారిక వాపోయింది. అయితే అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి ప్రవర్తనపై మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. గంగిరెడ్డి ప్రవర్తించిన తీరు సరికాదని, విచారణ తరువాత చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. యోగి, హారికతో అసభ్యకరంగా మాట్లాడాడని, హారిక భర్తకు కూడా అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెట్టాడని ఆయన చెప్పారు. హారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీసీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

నటి హారిక, తాను మంచి స్నేహితులమని ఒక చిన్న గొడవ కారణంగా తమ మధ్య మనస్పర్థలు వచ్చాయని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి తెలిపాడు. ఆమె వద్ద తాను రూ. 10 వేలు తీసుకున్నానని ఈ డబ్బు గురించే తనను పోలీసుల వద్దకు పిలిపించిందని చెప్పాడు. విచారణ సందర్భంగా అడిషనల్ డీసీపీ గంగిరెడ్డితో తాను మాట్లాడుతూ 'సార్, కేవలం పది వేల కోసం పిలిపిస్తారా? ఇది అన్యాయం సార్' అని అన్నానని దీంతో, ఆయన తనపై చేయిచేసుకున్నారని నాతోనే మాట్లాడతావా? అంటూ తిట్టారని యోగి తెలిపాడు.

పది వేల గురించి పిలవడం దారుణం అని అన్నందుకే అప్పటికప్పుడు హారిక చేత తనపై కంప్లైంట్ రాయించారని యోగి అడిషనల్ డీసీపీపై ఆరోపించారు. హారికకు ఓ నిర్మాత కుమారుడితో లవ్ మ్యాటర్ ఉందని ఇది తనతో పాటు మరొకరికి కూడా తెలుసని ఈ విషయం బయటకు పొక్కడంతో, ఇతరులకు చెప్పింది తానే అని హారిక భావించిందని 'నా విషయాలు బయటకు చెబుతావా నీ పరువు కూడా తీస్తా' అంటూ తనను హెచ్చరించిందని చెప్పాడు. ఈ క్రమంలో కొంతమేర వాదోపవాదాలు జరిగాయని తెలిపాడు.

విచారణ సందర్బంగా తన ఫోన్ లో అమ్మాయిల న్యూడ్ ఫొటోలు ఉన్నాయంటూ గంగిరెడ్డి మొబైల్ ను లాక్కున్నారని మొత్తం చెక్ చేసినా అభ్యంతరకరమైనది ఏదీ దొరకలేదని యోగి అన్నాడు. ఒక డైరెక్టర్ గా కొందరు యాక్టర్ల ప్రొఫైల్స్ తన వద్ద ఉండటం సహజమేనని చెప్పాడు. దాదాపు 600 మంది ఫొటోలు తన వద్ద ఉంటాయని అయితే, తనను అమ్మాయిలను సప్లై చేసే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. జరిగిన వాస్తవాలను తాను చెబుతున్నప్పటికీ అడిషనల్ డీసీపీ పట్టించుకోలేదని అన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే, ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని చెప్పాడు.

గంగిరెడ్డితో హారికకు ఇంతకు ముందు నుంచే పరిచయం ఉందని ఆమెకు ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పేదని ఈ నేపథ్యంలోనే, పది వేల కోసం మళ్లీ ఆయనను కలిసిందని యోగి తెలిపాడు. తనకు పనిష్ మెంట్ ఎందుకిచ్చారో అర్థంకావడం లేదని అన్నాడు. ఎంక్వైరీ సరిగా చేయలేదని... తాను చెప్పే విషయాలను పట్టించుకోలేదని తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories