హోంమంత్రి కాన్వాయ్‌లో మంటలు

Submitted by arun on Fri, 01/05/2018 - 12:59

హోంమంత్రి చినరాజప్ప కాన్వాయ్‌లోని జీపులో మంటలు చెలరేగాయి. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ జిల్లాకు మంత్రి బయలదేరారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని జీపులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది కిందకు దిగారు. జీపు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికీ ఎలాంటి అపాయం జరుగకపోవడంతో చినరాజప్పతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆకవరపాలెం సర్పానది వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, చినరాజప్పతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

English Title
short circuit in minister chinarajappa convoy

MORE FROM AUTHOR

RELATED ARTICLES