దూసుకొస్తున్న ట్రైన్ ముందు సైకిలిస్టు.. క్షణాల్లో..

Submitted by nanireddy on Fri, 11/30/2018 - 21:08
shocking-video-cyclist-miraculous-escape

భూమ్మీద నూకలు ఉండాలే గాని మృత్యువు అంచుల దాకా వెళ్లినా బతికి బట్టకట్టవచ్చు అనే సామెతను వినే ఉంటారు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణ. సెకన్ల తేడాతో రైలు ప్రమాదం నుండి తప్పించుకున్నాడు ఓ యువకుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్  గా మారింది. నెదర్లాండ్స్ లోని రైల్వే క్రాసింగ్‌ వద్ద ఓ సైకిలిస్టు ట్రాక్ దాటే ప్రయత్నంలో ఒకవైపు ట్రైన్ వస్తోందని ఆగాడు. అయితే కొంతసేపటికి ఆ ట్రైన్ వెళ్లగానే ట్రాక్ దాటుతున్నాడు.. ఇంతలో మరోవైపు నుంచి వేగంగా ఇంకో ట్రైన్ దూసుకొచ్చింది. ఆ ట్రైన్‌ను అతను గమనించకుండా  సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇంతలో రైలు స్పీడ్‌గా అతనికి రెప్పపాటు దూరం నుంచి వెళ్లిపోయింది. దాంతో అతని గుండె ఒక్కసారిగా  అతని గుండె ఆగినంత పనైంది.  ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. 

English Title
shocking-video-cyclist-miraculous-escape

MORE FROM AUTHOR

RELATED ARTICLES