ప్రముఖులను కన్నడిగులు ఎందుకు కాదనుకున్నారు?

Submitted by santosh on Wed, 05/16/2018 - 10:45
shock political familiers in karnataka

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పలువురు ప్రముఖులకు షాకిచ్చాయి. తమకు తిరుగులేదని భావించిన అభ్యర్థుల్లో పలువురు ఓటమి పాలయ్యారు. రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేసిన సీఎం సిద్దరామయ్య, బీజేపీ బిగ్ షాట్ శ్రీరాములును ఒక సీటుకు పరిమితం చేశారు. కన్నడ ఓటర్లు ఏకంగా 16 మంది మంత్రుల అడ్రస్‌ గల్లంతు చేసి తమ ఆగ్రహాన్ని రుచి చూపారు. 

సీఎం సిద్ధరామయ్యకు కన్నడ ఓటర్లు షాకిచ్చారు. సిద్ధరామయ్య రెండు చోట్ల పోటీ చేస్తే... ఒక స్థానంలో ఘోర ఓటమి చవిచూశారు, మరో స్థానంలో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో దాదాపు 37వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన సిద్ధరామయ్య.... బాదామిలో మాత్రం కేవలం 3వేల ఓట్ల మెజారిటీతో గెలిచి పరువు నిలుపుకున్నారు. ఇక కాంగ్రెస్‌ పరాజయంతో సిద్ధరామయ్య నివాసం వెలవెలబోయింది. చాముండేశ్వరిలో స్వయంగా సీఎం సిద్ధరామయ్యే ఓటమి చవిచూడగా... ఏకంగా 16మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఇక కర్నాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర....  కొరటగెరె నుంచి విజయం సాధించారు.

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప... షికారిపుర నుంచి ఘనవిజయం సాధించారు. ఇక బాదామిలో సిద్ధరామయ్యతో తలపడి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన గాలి అనుచరుడు, బీజేపీ అభ్యర్ధి శ్రీరాములు.... మరో నియోజకవర్గం మొలకల్మారు నుంచి విజయబావుటా ఎగురవేశారు. ఇక జేడీఎస్‌ అధినేత దేవెగౌడ కుమారులిద్దరూ గ్రాండ్‌ విక్టరీ కొట్టారు. రామనగర నుంచి కుమారస్వామి.... హైలెనరసపూర్‌ నుంచ హెచ్‌డీ రేవణ్ణ ఘనవిజయం సాధించారు. అలాగే జేడీఎస్‌ కీలక నేత జీటీ దేవేగౌడ... సీఎం సిద్ధరామయ్యను ఓడించి.... చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు.

ఇక బాగేపల్లి నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన ప్రముఖ సినీనటుడు సాయికుమార్ ఘోర పరాజయం చవిచూశారు. స్థానికేతరుడు కావడంతో ప్రజలు తిరస్కరించారు. సాయికుమార్‌ను ఏకంగా నాలుగో స్థానానికి పరిమితం చేశారు.

English Title
shock political familiers in karnataka

MORE FROM AUTHOR

RELATED ARTICLES