చిక్కుల్లో పడ్డ రాహుల్ గాంధీ

Submitted by nanireddy on Wed, 10/31/2018 - 06:36
shivraj-chouhans-son-files-defamation-suit-against-rahul-gandhi-congress-president-says-he-got-confused

అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,  కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి  రాహుల్ గాంధీ పై సాక్షాత్తు సీఎం కుమారుడే పరువునష్టం పిటిషన్ వేశాడు. తన పరువుకు భంగం కలిగిందనే ఉద్దేశ్యంతో  రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ పరువునష్టం దావా వేశారు. తనకు అసలు సంబంధమే లేని వ్యవహరంలో ప్రమేయం ఉందంటూ రాహుల్ తన పరువు తీశాడంటూ ఆయన పిటిషన్ లో పేర్కొన్నాడు. సోమవారం మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగాప్రధాని నరేంద్రమోడీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఆయన నిప్పులు కక్కారు. పేర్లు పెట్టకుండానే మోడీని చౌకిదార్ అని, శివరాజ్‌ను మామాజీ అని సంభోదించారు. ఇక శివరాజ్‌ సింగ్ చౌహాన్ సర్కారు అవినీతి కూపంలో కూరుకుపోయిందని రాహుల్ ఆరోపించారు. అంతేకాదు శివరాజ్ సింగ్ కొడుకు కార్తీకేయ్ పేరు పనామా పేపర్లలో ఉందంటూ ఆరోపించారు. అయితే ఈ ఫనామా పత్రాల్లో అసలు కార్తికేయ పేరు లేకపోవడంతో తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై స్పందిస్తూ రాహుల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజెపి పార్టీలో అవినీతి ఎక్కువ కాబట్టే తాను పొరపడినట్లున్నానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ క్రమంలో తనను అనవసరంగా రాహుల్ గాంధీ విమర్శించాడని కార్తికేయ ఆయనపై పరువు నష్టం దాఖలు చేశారు. దాంతో రాహుల్ గాంధీ చిక్కుల్లో పడినట్లయింది.  

English Title
shivraj-chouhans-son-files-defamation-suit-against-rahul-gandhi-congress-president-says-he-got-confused

MORE FROM AUTHOR

RELATED ARTICLES