వాజ్‌పేయి ఆగస్టు 16నే మృతిచెందారా?.. లేక దాచారా.?

వాజ్‌పేయి ఆగస్టు 16నే మృతిచెందారా?.. లేక దాచారా.?
x
Highlights

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అనారోగ్యంతో ఈనెల 16 మృతిచెందిన సంగతి తెలిసిందే. అయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా...

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అనారోగ్యంతో ఈనెల 16 మృతిచెందిన సంగతి తెలిసిందే. అయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. అంతేకాకుండా అయన చితాభస్మానన్నీ అన్ని రాష్ట్రాలకు పంపి పవిత్ర నదుల్లో నిమజ్జనం చెయ్యాలని సూచించింది. ఇదిలావుండగా వాజ్‌పేయి ఆగస్టు 16నే మృతిచెందారా? అని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన అనుమానం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆగస్టు 16 నాడు మృతి విషయాన్ని వెల్లడించారా? అని శివసేన అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ప్రశ్నించింది. 'ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు. కానీ 12–13 తేదీల నుంచే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోంది. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవంనాడు దేశవ్యాప్తంగా సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన మోదీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?' అని సామ్నా సంపాదకీయంలో రాసి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories