తిరుమల రికార్డును బద్దలు కొట్టిన షిర్డీ సాయిబాబా

Submitted by arun on Tue, 07/31/2018 - 10:29

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం తిరుమల. నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామి వారి సేవలో తరిస్తారు. అయితే ఇంతకాలం ఆదాయం ఆర్జనలోనూ వెంకన్నకు పోటీ పడే ఆలయం లేదు. ఈ నెల 26న తిరుమలకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ రికార్డును వారం రోజులు తిరక్కుండానే మరో ఆలయం బద్దలు కొట్టింది. వడ్డీ కాసుల వెంకన్న మించిన ఆదాయం ఏ ఆలయానికి వస్తోంది. 

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు షిర్డీలో కొలువైన సాయినాథుడు. ఈ రెండు దేవాలయాలు నిత్యం భక్తులతో కిక్కిరిసిపోతుంటాయ్. ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని, షిర్డీ సాయిబాబాను దర్శించుకుంటారు. అంతేనా అంటే హుండీ ద్వారా భక్తులు సమర్పించే ఆదాయంలోనూ వెంకన్న, షిర్డీ సాయిబాబాలు పోటీ పడుతున్నారు. 

తిరుమల వెంకటేశ్వరస్వామి వారికి ఈ నెల 26న రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గతంలో ఎన్నడూ విధంగా హుండీలో కానుకలు సమర్పించారు వెంకన్న భక్తులు. ఒక్క రోజే స్వామివారికి 6.28 కోట్ల రూపాయలు కానుకల రూపంలో సమర్పించి రికార్డు సృష్టించారు. తిరుమల చరిత్రలోనే తొలిసారి అత్యధికంగా హుండీ ద్వారా ఆదాయం వచ్చింది. శ్రీవారికి 2012 ఏప్రిల్ 2న హుండీ ద్వారా 5.73 కోట్లు భక్తులు మొక్కుల రూపంలో కానుకలు సమర్పించారు. ఈ రికార్డును తిరగరాస్తూ 6.28 కోట్ల రూపాయలను భక్తులు హుండీల్లో వేశారు.

తిరుమల శ్రీవారికి వచ్చిన రికార్డ్ హుండీ ఆదాయాన్ని షిర్డీ సాయిబాబా భక్తులు తిరగరాశారు. గురుపౌర్ణిమ సందర్భంగా లక్షలాది మంది భక్తులు షిర్డీ సాయిబాబాను దర్శించుకొని భారీ ఎత్తున కానుకలు సమర్పించారు. గురుపౌర్ణమి ఒక్కరోజే షిర్డీ సాయికి 6.40 కోట్ల ఆదాయం హుండీ ద్వారా వచ్చింది. వీటిలో 13.83 లక్షలు విలువచేసే స్వర్ణాభరణాలు, 6.41 లక్షల నగదు, రూ.11.25 లక్షల విదేశీ కరెన్సీ ఉన్నాయి. 

గురుపౌర్ణమి ఒక్క రోజే కాదు పలు సందర్భాల్లో షిర్డీ సాయిబాబా తిరుమల వెంకన్నతో పోటీ పడుతున్నారు. తిరుమల వెంకన్న తర్వాత భారీగా ఆస్తులున్నది కూడా షిర్డీ ఆలయానికే. వాటికన్‌ సిటీలోని చర్చ్ కంటే ఈ ఆలయాలకు వచ్చే ఆదాయం ఎంతో ఎక్కువ. ఆదాయ ఆర్జనలోనూ తిరుమల, షిర్డీ ఆలయాలు ముందు వరుసలో ఉన్నాయ్. 

English Title
Shirdi: New record of offerings by devotees at Sai Baba Mandir

MORE FROM AUTHOR

RELATED ARTICLES