శిల్ప కేసులో సీఐడీ

Submitted by arun on Thu, 08/09/2018 - 17:41
Shilpa suicide case under CID

తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని శిల్ప ఆత్మహత్య కేసులో స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. సీఐడీ డీఎస్పీ జీవీ రమణ ఆధ్వర్యంలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లతో ఏర్పాటైన బృందం దర్యాప్తు ప్రారంభించింది. శిల్ప ఆత్మహత్య కేసును సిట్ పలు కోణాల్లో విచారిస్తోంది. ఎస్వీ మెడికల్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థి సంఘ నేతలు, శిల్ప స్నేహితులు, యూజీ, పీజీ విద్యార్థులను పిట్ ప్రశ్నిస్తోంది. శిల్ప చనిపోవడానికి కారణమెవరు..లైంగిక వేధింపుల్లో ఎవరెవరి ప్రమేయం ఉంది..ముగ్గురు అధ్యాపకులపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత అనే కోణాల్లో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. విచారణ తర్వాత నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనుంది. 

శిల్ప ఆత్మహత్య కేసులో ఎస్వీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్వీ రమణయ్యను సస్పెండ్ చేయడం వివాదానికి దారి తీసింది. లైంగిక వేధింపుల వ్యవహారంలో ఎన్వీ రమణయ్య ఉదాసీనంగా వ్యవహారంచడం వల్లే శిల్ప ప్రాణాలు తీసుకొందన్న ఆరోపణల నేపథ్యంలో  ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ప్రిన్పిపల్ స్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ ధర్నాకు దిగింది. శిల్ప ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ ఎన్వీ రమణయ్యను బలిపశువుని చేశారని వెం టనే ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

మరోవైపు శిల్ప ఆత్మహత్య వ్యవహారంపై ఆమె చెల్లులు శృతి ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేశారు. శిల్ప ఆత్మహత్యకు సంబంధిచిన ప్రాధమిక సమాచారాన్ని సేకరించిన పీలేరు పోలీసులు డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశికుమార్‌‌పై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వెంటనే వీరు ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. శిల్ప కేసులో ఇప్పటికే ప్రభుత్వ డాక్టర్‌ రవికుమార్‌ను సస్పెండ్ చేసి నెల్లూరు మెడికల్ కాలేజీకి బదిలీ చేయగా డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశికుమార్‌‌ను కూడా అదే మెడికల్ కళాశాలకు బదిలీ చేసింది. డీఎంఈ బాబ్జీ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు శిల్ప ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు ప్రొఫెసర్లను ప్రభుత్వం నిన్న బదిలీ చేసింది. 
 

English Title
Shilpa suicide case under CID

MORE FROM AUTHOR

RELATED ARTICLES