టెస్ట్ క్రికెట్లో శిఖర్ ధావన్ అరుదైన సెంచరీ

Submitted by arun on Thu, 06/14/2018 - 17:56
Shikhar Dhawan

టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్....టెస్ట్ క్రికెట్లో ఓ అరుదైన సెంచరీ సాధించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా క్రికెట్ కూన అప్ఘనిస్థాన్ తో ప్రారంభమైన అరంగేట్రం టెస్ట్ తొలిరోజు ఆట...తొలిసెషన్ లోనే..శిఖర్ ధావన్ శతకం బాది...ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. మురళీ విజయ్ తో కలసి టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించిన ధావన్ కేవలం 87 బాల్స్ లోనే శతకం బాదాడు. ధావన్ సెంచరీలో 18 బౌండ్రీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. తన కెరియర్ లో 30వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న శిఖర్ ధావన్ కు ఇది ఏడవ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు...మొదటి వికెట్ కు 168 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు పునాది వేసిన ధావన్ చివరకు 107 పరుగులకు అవుటయ్యాడు. టెస్ట్ క్రికెట్ తొలిరోజుఆట తొలిసెషన్ లోనే సెంచరీలు సాధించిన ఆరుగురు క్రికెటర్లలో శిఖర్ ధావన్ సైతం చేరాడు.

English Title
Shikhar Dhawan Joins Elite Club of Centurions Before Lunch on Day 1

MORE FROM AUTHOR

RELATED ARTICLES