షీ టీమ్స్‌కి సవాల్‌... పోకిరీలపై ఉక్కుపాదం

Submitted by santosh on Fri, 05/11/2018 - 14:35
shee teams in telangana

ఒళ్లు కొవ్వెక్కిన కొందరు కంత్రీగాళ్ల తాట తీస్తున్నా.. వారి ప్రవర్తలో మాత్రం మార్పు రావడం లేదు. అమ్మాయిలను వేధిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరిస్తున్నా.. వారి నైజం మాత్రం వదులుకోవడం లేదు. పోకీల పని పట్టేందుకు షీ టీమ్స్‌ రంగంలోకి దిగుతున్నా.. కొందరు పోకిరీలు పుట్టుకతో వచ్చిన బుద్దులు వదులుకోవడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న షీ టీమ్స్ కేసులపై ప్రత్యేక కథనం.. 

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పోకిరీల పని పట్టేందుకు ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. బస్టాప్‌ల్లో, బిజీ ఏరియాల్లో, షాపింగ్‌ మాల్స్‌లో తదితర ప్రాంతాల్లో సివిల్ డ్రెస్‌లోనే టీమ్స్ అందుబాటులో ఉంచాయి. అమ్మాయిలను వేధిస్తే అప్పటికప్పుడు వారిని అదుపులోకి తీసుకోవడం.. కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతోంది. కేసు తీవ్రతను పట్టి శిక్ష పెరుగుతుంది. అయితే షీ టీమ్స్ అందుబాటులో ఉన్నా.. పోకిరీల పని మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకూ వారి ఆగడాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 

గత 6 నెలల కాలంలో.. ఈవ్‌ టీజింగ్ కేసులు సుమారు వెయ్యికి పైగా నమోదయ్యాయి. ఇందులో షీ టీమ్స్ డైరెక్ట్‌గా పట్టుకున్న కేసులు.. 600 లకు పైగానే ఉన్నాయి. అయితే ఇలాంటి వారికి కౌన్సెలింగ్ పేరుతో.. అవగాహన కల్పిస్తున్నా.. వారి ప్రవర్తనలో పెద్దగా మార్పురావడం లేదనే విషయాన్ని మహిళా రక్షణ దళం గుర్తిస్తోంది. అయితే వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థీ నాయకులు సూచిస్తున్నారు. 

ఒకసారి షీటీమ్స్ వలలో పట్టుబడిన అబ్బాయిలు.. మళ్లీ వేధింపులకు గురిచేయడాన్ని రక్షణ దళం గుర్తిస్తోంది. వారి విషయంలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు వివరిస్తున్నారు. అయితే ఆకతాయిల విషయంలో వారి తల్లిదండ్రులు కూడా కేర్ తీసుకోవాలని విద్యార్థినులు సూచిస్తున్నారు. కౌన్సెలింగ్ కాకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. సామ, దాన, భేద, దండోపాయాల పద్దతిలో పోకిరీల విషయంలో తాము వ్యవహరిస్తున్నామని.. క్రైమ్ డిపార్ట్ మెంట్ అడిషనల్ సీపీ శిఖా గోయల్ చెబుతున్నారు. అయినా మారకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పీడీ యాక్ట్ కేసుల్లో ముగ్గురు శిక్షను కూడా అనుభవిస్తున్నారని తెలిపారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నవారిలో.. 17 నుంచి 21 వయస్సున్న వాళ్ల అబ్బాయిలే ఉన్నారని చెప్పారు. 

English Title
shee teams in telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES