పెంపుడు కుక్కల కోసం కట్టుకున్న భర్తను..

Submitted by arun on Wed, 06/13/2018 - 16:54
Adopted Dogs

ఆవిడకు కుక్కలంటే ఎంతో ప్రేమ. వాటికోసం ఏమైనా చేయడానికి ఆవిడ వెనకాడదు. ఎంతలా అంటే ఆ మూగ ప్రాణాల కోసం తన 25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని వదులుకుంది. భర్తతో తగువు పడి అతని నుంచి విడిపోయింది. ఈ సంఘటన బ్రిటన్‌లోని సఫోక్‌ కౌంటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సఫోక్‌ కౌంటీకి చెందిన లిజ్‌ గ్రూ(45) మైక్‌ అస్లామ్‌(53) భార్యాభర్తలు వీరికి 21 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. లిజ్‌ గ్రూకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే అమితమైన ప్రేమ. అందుకే పెళ్లైన తర్వాత కూడా ఇంటిని మొత్తం మూగజీవాలతో నింపేసింది. ఇంటిని మొత్తం కుక్కలు ఆక్రమించేయడంతో భర్త మైక్‌కు కోపం వచ్చింది. ఈ విషయమై ఇరువురికి తరుచూ గొడవలు జరిగేవి. అలా 25 ఏళ్ల నుంచి గొడవ పడుతూనే ఉన్నారు. ఉన్నట్టుండి తాజాగా జరిగిన గొడవలో ‘నేను, కావాలో కుక్కలు కావాలో తేల్చుకోమని లిజ్‌కు మైక్ స్పష్టం చేశాడు. దీంతో లిజ్ కుక్కలతో పాటు ఇళ్లు వదిలి వచ్చేసింది.
 
ప్రస్తుతం లిజ్ వద్ద 30 పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటిలో 5 కుక్కలకు చెవుడు కాగా మరో రెండు కుక్కలకు ఒక కన్ను మాత్రమే ఉంది. వాటిలో మిగిలినవి వేటకుక్కలు వీటిలో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి. కాగా తన తండ్రికి కుక్కలకు ఆహారం తయారు చేసే వ్యాపారం ఉండేదని అలా చిన్నప్పటి నుంచి వాటి మధ్యే పెరగడం వల్ల, మూగ జీవాల పట్ల ప్రేమాభిమానాలు పెరిగాయని లిజ్ పేర్కొన్నారు.

English Title
She Left Her Husband For Her Adopted Dogs!

MORE FROM AUTHOR

RELATED ARTICLES