టికెట్ దక్కకుంటే ఆయన పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా : శంకరమ్మ

Submitted by nanireddy on Sat, 09/22/2018 - 07:59
shankaramma-party-ticket-issue

ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తనకు టికెట్‌ ఎందుకు దక్కలేదని మండిపడ్డారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. తనకు టికెట్ దక్కకుండా జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుంటే సూసైడ్‌ నోటు రాసి అందులో జగదీశ్‌రెడ్డి పేరు చేర్చి ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు.  జగదీశ్‌రెడ్డి ప్రవర్తనతో తాను విసిగిపోయానని కంటతడి పెట్టారు. హుజూర్‌నగర్‌ కేటాయించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అనుకూలంగా ఉన్నా.. మంత్రి జగదీశ్‌రెడ్డి వారికి అసత్యాలు చెప్పి టికెట్ రాకుండా అడ్డుపడుతున్నాడని ఆమె ఆరోపించారు.తెలంగాణోద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని, అలాంటి కుటుంబాలకు కాకుండా ఎవరికో టికెట్ కేటాయించడంలో అర్ధం లేదని ఆమె అన్నారు.   

English Title
shankaramma-party-ticket-issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES