టెన్షన్ లో షారుక్ ఖాన్

Submitted by arun on Wed, 01/03/2018 - 12:05
Shah Rukh Khan

ఎంత పెద్ద స్టార్ హీరో ఐనా ఒక్కోసారి కాలం కలిసి రాక..తిప్పలు తప్పవు అన్నట్టు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా..ఒక్క హిట్ కోసం నానా పాట్లు పడుతున్నాడు. కమర్షియల్ సినిమాలు కలిసి రావడంలేదనుకున్నాడో ఏమోకానీ. రకరకాల ఎక్స్ పరిమెంట్లకు తెర తీశాడు. అందరూ ఆశ్చర్యపోయేలా జీరో మూవీలో మరుగుజ్జు పాత్రలో కనిపించబోతున్నాడు. 

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టైం ఏం బాగోలేదు. మొన్నటి వరకు హిట్ల మీద హిట్లు కొడుతూ బాలీవుడ్ ను దున్నేసిన షారుక్.. ప్రస్తుతం డీలా పడిపోయాడు. గత రెండేళ్లుగా సరైన హిట్టే లేదు. రిలీజైన సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయే తప్పా పెద్దగా సందడి చేయడంలేదు. దీంతో షారుక్ నెక్ట్స్ మూవీతో ఎక్స్ పరిమెంట్లు చేస్తున్నాడు.

షారుఖ్ ఖాన్ ప్రజెంట్ జీరో అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో షారుక్ మరుగుజ్జు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు. షారుక్ ఖాన్ పాత్రను చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. షారుక్ ఇలాంటి పాత్ర చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

షారుక్ ఖాన్ కు ఎక్స్ పరిమెంట్లు చేయడం ఇదేం కొత్తేం కాదు. గతంలో మై నేమ్ ఈజ్ ఖాన్ లో మెంటల్లీ హ్యాండీక్యాపుడుగా నటించాడు. ఏడాది క్రితం ఫ్యాన్ మూవీలో కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించాడు. కానీ ఈ జీరో సినిమాలో మాత్రం షారుక్ ది పూర్తిగా భిన్నమైన పాత్ర. ఒక్క హిట్టు కోసం ఎన్ని వేశాలు వేయాలో అన్ని ట్రై చేస్తున్నాడు. మరి ఈ ఎక్స్ పరిమెంట్ ఐనా వర్కౌటల్ అవుతుందో లేదో చూడాలి. 
 

English Title
Shah Rukh Khan’s Zero so far

MORE FROM AUTHOR

RELATED ARTICLES