శబరిమలలో దర్శనం : మహిళలను అడ్డుకుంటున్న అయ్యప్ప మహిళా భక్తులు

Submitted by nanireddy on Wed, 10/17/2018 - 15:08
shabharimala latest news updates

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు కొందరు మహిళలు సిద్ధపడుతుండటంతో... శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము కచ్చితంగా స్వామిని దర్శించుకుంటామని పలువురు మహిళలు పట్టుబడుతుంటడం...వారికి ఎలాగైనా అడ్డుకుంటామని మరికొందరు మహిళా భక్తులు, హిందూ సంఘాలు ప్రకటించడంతో శబరిమల పరిసరాల్లోనే టెన్షన్ నెలకొంది. అయితే అన్ని వయసుల మహిళలను శబరిమలకు అనుమతిస్తామంటున్న కేరళ పోలీసులు... ఆందోళన చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు శబరిమల సన్నిదానం తెరుచుకోనుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సమయంలోనే స్వామిని దర్శించుకుంటామని కొందరు మహిళలు ఆలయానికి బయలుదేరారు. అయితే అయ్యప్ప సన్నిధిలో ఆడవారిని అనుమతించమంటూ మరికొందరు మహిళా భక్తులు నీలక్కల బేస్ క్యాంప్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రకటించారు. మరోవైపు ఆలయంలో ప్రవేశం విషయంపై అనవసర రాద్ధాంతం వద్దన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కాలానుగూణంగా పద్ధతులు మారాల్సిందేనన్న సీఎం వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆలయ అధికారులు, పూజరులు సైతం అయ్యప్ప సన్నిధిలో మహిళలు ప్రవేశంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన పూజరి సైతం పూజలు చేయకుండా నిరసనకు దిగుతానని హెచ్చరిస్తున్నారు. ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘిస్తే రోజూ స్వామికి పుణ్యాహవచనం చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అది సాధ్యం కాదు కాబట్టి ఆలయాన్ని నిరవధికంగా మూసేస్తామని చెబుతున్నారు. నిషేధిత వయస్కులైన మహిళలు ఆలయంలోకి వచ్చినా, ఆలయ సంప్రదాయాలకు సంబంధించి ఇతర ఉల్లంఘనలు జరిగినా పుణ్యాహవచనం అంటే ఆలయాన్ని శుద్ధి చేసే పూజ చేయడం తప్పనిసరి.

English Title
shabharimala latest news updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES