జూనియర్ ఆర్టిస్ట్ పై సామూహిక అత్యాచారం

జూనియర్ ఆర్టిస్ట్ పై సామూహిక అత్యాచారం
x
Highlights

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం జరుగుతున్నా మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌ల పై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ పై...

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం జరుగుతున్నా మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌ల పై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన ఓ యువతి హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళేది. ఈ క్రమంలో ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న యువతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెకు దగ్గరలోని ఓ హాస్టల్‌లో చేరాడు. సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం వీరిద్దరు ‘మన’ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేశారు. అయితే సభ్యత్వం పేరిట వసూలు చేసిన డబ్బుల విషయంలో వివాదం ఏర్పడింది. ఇది మనసులో పెట్టుకున్న రాజ్ కిరణ్ పథకం పన్నీ, మరో ముగ్గురితో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు పిర్యాదు మేరకు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories